AP Assembly 2026: నేటి నుంచి మరలా ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. సభలో హాట్ హాట్ చర్చలు!
- నేటి నుంచి మరలా ఏపీ అసెంబ్లీ సమావేశాలు
- ప్రశ్నోత్తరాలతో సభా కార్యక్రమాలు మొదలు
- అసెంబ్లీ సమావేశాల్లో హాట్ హాట్ చర్చలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాలుగు రోజుల విరామం అనంతరం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి మళ్లీ ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలతో సభా కార్యక్రమాలు మొదలుకానున్నాయి. వివిధ శాఖలకు సంబంధించిన కీలక అంశాలపై సభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో వి.బి.జి రామ్ జీ జాబ్ కార్డులు, పీపీపీ మోడల్ కింద ఏర్పాటు చేస్తున్న వైద్య కళాశాలలు, రెవిన్యూ శాఖలో పెండింగ్‌లో ఉన్న కేసులు వంటి అంశాలు ప్రస్తావనకు రానున్నాయి.
Also Read: YS Jagan: నేడు అరకు, విశాఖలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన!
Also Read
- Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
- DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
- Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
అలాగే సింహాచలం పంచగ్రామాలలో అనధికారిక నిర్మాణాలు, విశాఖపట్నం జిల్లాలో పరిశ్రమల అభివృద్ధి అంశాలపై కూడా సభ్యులు ప్రశ్నలు అడగనున్నారు. కోనసీమ జిల్లాలో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు, వరి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, గృహ నిర్మాణ కాలనీల్లో మౌలిక సదుపాయాల కొరత వంటి ప్రజాసంబంధిత అంశాలు కూడా సభలో చర్చకు రానున్నాయి. అదనంగా విశాఖ ఉక్కు కర్మాగారం భవిష్యత్తు, 2014-2019 మధ్య నిర్మించిన పక్కా గృహాల బిల్లుల చెల్లింపులపై సభ్యులు వివరణ కోరనున్నారు. ఇవే కాకుండా వివిధ శాఖల డిమాండ్లు, గ్రాంట్లపై కూడా సభలో విస్తృత చర్చ జరగనుంది. కీలక అంశాలపై ప్రభుత్వ సమాధానాలు, ప్రతిపక్ష విమర్శలతో సభలో హాట్ హాట్ చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!