అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతిచెందడం తీవ్ర కలకలం రేపుతోంది. ఉమా సత్య సాయి గద్దె అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాదిలో యునైటెడ్ స్టేట్స్‌లో భారత సంతతికి చెందిన వారు మృతిచెందడం ఇది 10వ ఘటన. అగ్ర రాజ్యంలో వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తోంది. ఉమా సత్య సాయి మరణాన్ని న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ ధృవీకరించింది. అయితే ఆ విద్యార్థి ఎలా చనిపోయాడు. మృతికి గల కారణాలు.. అలాగే అతని వివరాలు, ఇండియాలో ఏ ప్రాంతపు వాసి అనే వివరాలు మాత్రం వెల్లడించలేదు.
ఇది కూడా చదవండి: Railway Jobs: పది అర్హతతో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
ఇక ఉమా సత్య సాయి గద్దె అనే విద్యార్థి ఒహియోలోని క్లీవ్‌ల్యాండ్‌లో విద్యను అభ్యసిస్తున్నాడు. సత్య సాయి మృతిపై దర్యాప్తు జరుగుతోందని శుక్రవారం భారత కాన్సులేట్ తెలిపింది. ఉమా సత్య సాయి మృతి పట్ల భారత కాన్సులేట్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మృతుని కుటుంబానికి సంతాపాన్ని తెలియజేసింది. ఈ బాధాకరమైన సమయంలో అతని మృతదేహాన్ని భారతదేశానికి పంపించడానికి ప్రతి సహాయాన్ని కుటుంబానికి అందజేస్తామని భారత కాన్సులేట్ హామీ ఇచ్చింది.
ఇది కూడా చదవండి: Congress: నేడు తుక్కుగూడలో కాంగ్రెస్ జన జాతర బహిరంగ సభ..
ఇక ఇటీవలే హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి మహ్మద్ అబ్దుల్ కూడా అదృశ్యమయ్యాడు. కిడ్నాపర్లు అతనిని కిడ్నాప్ చేసి.. తల్లిదండ్రులకు ఫోన్ చేసి భారీగా నగదు డిమాండ్ చేశారు. డబ్బు ఇవ్వకుంటే కిడ్నీ అమ్మేస్తామంటూ బెదిరించారు. ఇలా వరుసగా భారత సంతతి వారు అమెరికాలో మృత్యువాత పడుతున్నారు. 2024 సంవత్సర ప్రారంభం నుంచి అమెరికాలో భారత సంతతికి చెందిన విద్యార్థులు 10 మంది మరణించారు.
Deeply saddened by the unfortunate demise of Mr. Uma Satya Sai Gadde, an Indian student in Cleveland, Ohio.
Police investigation is underway. @IndiainNewYork continues to remain in touch with the family in India.
All possible assistance is being extended including to transport…
— India in New York (@IndiainNewYork) April 5, 2024