Annadata Sukhibhava 2026: రైతులకు ఉగాది కానుక.. నేడే ‘అన్నదాత సుఖీభవ’ మూడో విడత నిధులు!
- ఆంధ్రప్రదేశ్ రైతులకు ఉగాది కానుక
- నేడే అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులు
- నేటితో రూ.20,000 ఆర్థిక సాయం పూర్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Annadata Sukhibhava 3rd Installment Today in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు శుభవార్త. 2026 ఉగాది కానుకగా ‘అన్నదాత సుఖీభవ’, ‘పీఎం కిసాన్ 3.0’ పథకాల కింద ప్రభుత్వం మూడో విడత ఆర్థిక సాయంను నేడు విడుదల చేయనుంది. ఈ విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 46.85 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.6,000 చొప్పున జమ చేయనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా కలిపి మొత్తం రూ.2,676 కోట్లను విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.1,874 కోట్లు ఉండటం విశేషం.
ఇప్పటికే అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ 3.0 పథకాల కింద రైతులకు రెండు విడతలుగా రూ.14,000 అందించారు. ఈరోజు జమ చేయనున్న రూ.6,000తో కలిపి రైతులకు సంవత్సరానికి ఇచ్చే రూ.20,000 ఆర్థిక సాయం పూర్తవుతుంది. రైతుల ఆర్థిక భారం తగ్గించి వారికి మరింత మద్దతు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ నిధుల విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు. కృష్ణా జిల్లాలోని గన్నవరం నియోజకవర్గం సూరంపల్లిలో నిర్వహించే కార్యక్రమం నుంచి సీఎం రైతుల ఖాతాల్లోకి నిధులను విడుదల చేయనున్నారు.
Also Read
- Mahendragiri Varahi: మహేంద్రగిరి వారాహి రివ్యూ..
- IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
- AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ప్రభుత్వం అలర్ట్! జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు..!
- IT Minister Sridhar Babu: రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాలకు బిగ్ బూస్ట్.. కొత్త GCC పాలసీపై ఐటీ మంత్రి కీలక ప్రకటన
Also Read: Daily Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి పెట్టుబడులు కలిసొస్తాయి!
ఈ కార్యక్రమం కోసం సీఎం చంద్రబాబు సాయంత్రం 4.20 గంటలకు సూరంపల్లికి చేరుకోనున్నారు. అనంతరం 4.25 నుంచి 4.55 గంటల వరకు రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని వారి సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. తర్వాత సాయంత్రం 5 గంటలకు ప్రజావేదిక సభలో పాల్గొని సీఎం ప్రసంగించనున్నారు. రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్య రైతాంగానికి ఎంతో ఉపశమనం కలిగిస్తుందని అధికారులు చెబుతున్నారు. ‘అన్నదాత సుఖీభవ’ పథకం ద్వారా రైతులకు స్థిరమైన ఆర్థిక మద్దతు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Soori: భారీగా పెరిగిన కమెడియన్ సూరి రెమ్యూనరేషన్.. రేంజ్ చూస్తే షాకవ్వాల్సిందే!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
Realme 16T 5G: 8000mAh బ్యాటరీతో అదరగొట్టే 5G ఫోన్.. 50MP కెమెరా, 144Hz డిస్‌ప్లే
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ప్రభుత్వం అలర్ట్! జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు..!
ట్రెండింగ్
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!