Anju Love Story: పాకిస్తాన్ వ్యక్తితో ప్రేమలో పడి అతని కలిసేందుకు వెళ్లిన అంజూ అనే మహిళ గురించి దేశం మొత్తం చర్చించింది. ఇలా వెళ్లిన అంజూ, ఆ దేశంలోని ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో నివసిస్తున్న స్నేహితుడు నస్రుల్లాను పెళ్లి చేసుకుంది. అంతే కాకుండా ముస్లిం మతాన్ని స్వీకరించి తన పేరు ఫాతిమాగా మార్చుకుంది.
రాజస్థాన్‌లోని అల్వార్‌కు చెందిన అంజు అనే వివాహిత ఆన్ లైన్లో పాకిస్తాన్ యువకుడితో ప్రేమలో పడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆ యువకుడిని పెళ్లి చేసుకుంది. అయితే అంజుకు సంబంధించి ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. నస్రుల్లాతో పెళ్లి తర్వాత అంజుకి ఖరీదైన బహుమతులు ఇస్తున్నారు.
రాజస్థాన్‌లోని అల్వార్ నుంచి పాకిస్థాన్ కు వెళ్లిన అంజు.. అక్కడ చాలా సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అంజు తన ప్రేమికుడు నస్రుల్లాతో కలిసి ఓ మైదానంలో తెగ ఎంజాయ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఉంది.