బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్.. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ మూవీ భారీ బ్లాక్‍బాస్టర్ హిట్ అయింది.డిసెంబర్ 1న థియేటర్లలో రిలీజైన యానిమల్ మూవీ సుమారు రూ.910 కోట్ల కలెక్షన్లను సాధించింది. ఇప్పుడు ఓటీటీలోనూ ఈ సినిమా సత్తాచాటుతోంది.యానిమల్ మూవీ జనవరి 26వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్స్ లో దుమ్మురేపిన యానిమల్ మూవీ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోనూ అదరగొడుతోంది.నెట్‍ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న యానిమల్ మూవీ ఇండియా ట్రెండింగ్‍లో ప్రస్తుతం టాప్‍కు వచ్చేసింది. ప్రభాస్ హీరోగా నటించిన సలార్ మూవీతో పోటీ పడుతోంది. యానిమల్ హిందీ వెర్షన్ ప్రస్తుతం ఫస్ట్ ప్లేస్‍కు వచ్చింది. ఈ విషయాన్ని యానిమల్ టీమ్ ట్వీట్ చేసింది.
సలార్ సినిమా జనవరి 20వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళం భాషల్లో స్ట్రీమ్ అవుతోంది. అప్పటి నుంచి నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో సలార్ టాప్‍లో ట్రెండ్ అవుతోంది. ఇండియాతో పాటు చాలా దేశాల్లో టాప్-10లో కొనసాగుతోంది. జనవరి 26న నెట్‍ఫ్లిక్స్‌లో యానిమల్ అడుగుపెట్టింది. దీంతో నెట్‍ఫ్లిక్స్‌లో యానిమల్ వర్సెస్ సలార్ పోటాపోటీగా జరుగుతోంది. ప్రస్తుతం ఇండియాలో యానిమల్ ట్రెండింగ్‍లో టాప్‍లోకి వచ్చింది.కాగా, సలార్ సినిమా చాలా దేశాల్లో టాప్-10లో ట్రెండ్ అవుతోంది. నెట్‍ఫ్లిక్స్‌లోకి వచ్చాక గ్లోబల్‍గా సలార్ మూవీ ఫుల్ పాపులర్ అయింది. సలార్ గోస్ గ్లోబల్ అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. గ్లోబల్‍గా ఇప్పటికీ నాన్-ఇంగ్లిష్ విభాగంలో టాప్-3లో సలార్ ట్రెండ్ అవుతోంది. అయితే, నెట్‍ఫ్లిక్స్‌లో ఇండియాలో సలార్‌కు యానిమల్ గట్టి పోటీని ఇస్తోంది. సలార్ ప్రస్తుతం రెండో స్థానంలో ట్రెండ్ అవుతోంది.అయితే సలార్ హిందీ వెర్షన్ కూడా నెట్‍ఫ్లిక్స్‌లోకి వస్తే కనుక మరోసారి ఆధిపత్యాన్ని చూపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది..
#Animal conquers @NetflixIndia as it is trending at #1 on the platform 🔥https://t.co/FosKOFbGgw#AnimalHuntBegins #BloodyBlockbusterAnimal #AnimalTheFilm @AnimalTheFilm @AnilKapoor #RanbirKapoor @iamRashmika @thedeol @tripti_dimri23@imvangasandeep pic.twitter.com/EpP6IZvOwb
— Animal The Film (@AnimalTheFilm) January 28, 2024