బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్.. ఈ మూవీని అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించారు.యానిమల్ మూవీలో రణ్‌బీర్‌కపూర్‌కు జోడీగా రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. అనిల్ కపూర్ రణ్ బీర్ తండ్రి పాత్రలో నటించారు.ఈ సినిమాలో బాబీడియోల్ విలన్ పాత్రలో నటించి మెప్పించారు. యానిమల్ మూవీ డిసెంబర్ 1 న గ్రాండ్ గా రిలీజ్ అయి అదిరిపోయే కలెక్షన్స్ సాధిస్తుంది. ఈ మూవీ బుధవారం నాటితో 500 కోట్ల కలెక్షన్స్ మార్కును కూడా చేరుకుంది.ఆరు రోజుల్లోనే యానిమల్ మూవీ ఈ ఘనతను సొంతం చేసుకుంది. అత్యంత వేగంగా ఐదు వందల కోట్ల కలెక్షన్స్ రాబట్టిన బాలీవుడ్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. థియేటర్లలో కలెక్షన్స్ వర్షాన్ని కురిపిస్తోన్న ఈ మూవీ వచ్చే నెలలోనే ఓటీటీలోకి రాబోతోంది.
యానిమల్ మూవీ ఓటీటీ హక్కులను రికార్డ్ ధరకు నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. ఈ బ్లాక్‌బస్టర్ మూవీ జనవరి 26న ఓటీటీ ఆడియెన్స్ ముందుకు రాబోతున్నట్లు సమాచారం. హిందీతో పాటు దక్షిణాది భాషల్లో కూడా అదే రోజు నుంచి యానిమల్ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. యానిమల్ మూవీ థియేటర్ రన్ టైం 3 గంటల 21 నిముషాలు..థియేటర్‌తో పోలిస్తే యానిమల్ మూవీ ఓటీటీ వెర్షన్ లెంగ్త్ ఇంకో ఇరవై నిమిషాల ఎక్కువగానే ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.తండ్రికొడుకుల డ్రామాకు యాక్షన్ రివేంజ్ అంశాలను జోడించి సందీప్ వంగా ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. ఇందులో తండ్రి పట్ల అపారమైన ప్రేమ కలిగిన యువకుడిగా రణ్‌బీర్ తన యాక్టింగ్‌తో ప్రేక్షకులను మెప్పించాడు. తన తండ్రిని హత్య చేయాలని ప్రయత్నించిన శత్రువుల్ని రణ్ బీర్ ఎలా ఎదుర్కొన్నాడన్నది విపరీతమైన వయోలెన్స్‌తో సందీప్ వంగా ఈ సినిమాలో చూపించారు.అతడి టేకింగ్, మేకింగ్‌పై బాలీవుడ్ మరియు టాలీవుడ్ ప్రముఖుల నుంచి కూడా ప్రశంసలు వినిపిస్తోన్నాయి. అయితే కొంత మంది మాత్రం సినిమాలో మితిమీరిన వయోలెన్స్ ఉందంటూ కామెంట్ లు చేస్తున్నారు..