బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ యానిమల్.. ఈ సినిమాలో రణ్ బీర్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది..అర్జున్ రెడ్డి వంటి బ్లాక్ బస్టర్ మూవీ తీసిన సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.. అయితే మూవీ రన్‌టైమ్‌పై సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర వార్త తెగ వైరల్ అవుతుంది యాక్షన్ డ్రామా గా తెరకెక్కిన ఈ మూవీ మూడు గంటల ముప్పై నిమిషాల లెంగ్త్‌తో విడుదల కాబోతున్నట్లు సమాచారం.స్టోరీ కన్వీన్సింగ్‌గా చెప్పాలంటే రన్‌టైమ్ విషయంలో రాజీపడకూడదని డైరెక్టర్ సందీప్ వంగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. అందుకే మూడున్నర గంటల నిడివితో ఈ సినిమా ను రిలీజ్ చేయాలని డిసైడ్ అయినట్లు సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తోన్నాయి.అదే నిజమైతే రీసెంట్ టైమ్స్‌లో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో లెంగ్త్ పరంగా అతి పెద్ద మూవీగా యానిమల్ నిలవడం ఖాయమని ఫ్యాన్స్ చెబుతున్నారు..
ఈ సినిమా రన్‌టైమ్ గురించి సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారంపై ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తోన్నారు. యానిమల్ మూవీకి రెండు ఇంటర్వెల్ బ్రేక్స్ ఇవ్వాలేమో అని కామెంట్స్ చేస్తున్నారు..కబీర్‌సింగ్ సక్సెస్ అనంతరం దాదాపు రెండేళ్ల విరామం తర్వాత సందీప్ వంగా యానిమల్ సినిమాను తెరకెక్కిస్తున్నారు.యానిమల్ మూవీ నుంచి ఇటీవల రిలీజైన పాటల్లో రణ్ బీర్ కపూర్, రష్మిక కెమిస్ట్రీ, లిప్‌లాక్‌లు ఎంతో హైలైట్ అయ్యాయి. ఈ లిప్‌లాక్‌లు సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీని తీసుకొచ్చాయి.తండ్రీకొడుకుల డ్రామాతో రూపొందుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ ముఖ్య పాత్రను పోషిస్తున్నాడు. మరో సీనియర్ హీరో బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్నాడు. యానిమల్ మూవీ హిందీ మరియు తెలుగుతో పాటు పాన్ ఇండియన్ లెవెల్‌లో డిసెంబర్ 1న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. టీ సిరీస్ సంస్థతో కలిసి సందీప్ వంగా యానిమల్ మూవీని నిర్మిస్తున్నాడు.