Animal : బాక్స్ఆఫీస్ వద్ద కుమ్మేస్తున్న యానిమల్.. 10 రోజుల్లో ఏకంగా అన్ని కోట్లా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్.. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.అలాగే అనిల్ కపూర్ రణ్ బీర్ తండ్రి పాత్రలో అద్భుతంగా నటించారు.విలన్ గా నటించిన బాబీ డియోల్ తన పెర్ఫార్మన్స్ తో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు..ఈ సినిమాను టీ-సిరీస్, భద్రకాళీ పిక్చర్స్ సంయుక్తంగా సినిమాను నిర్మించాయి.ఈ సినిమా డిసెంబర్ 1 న విడుదల అయి ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంటుంది. అయితే యానిమల్ మూవీ పై కొంతమంది మాత్రం విమర్శలు చేస్తున్నారు. కానీ యానిమల్ మూవీపై ఎన్ని విమర్శలు వస్తున్నా ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాను ఆదరిస్తున్నారు.. యానిమల్ మూవీలో హింస మరీ ఎక్కువగా ఉండటం, మహిళల పట్ల వివక్ష నేపథ్యంలో ఎంతో మంది ప్రముఖులు ఈ సినిమాపై విమర్శలు గుప్పించారు.
అదే సమయంలో రాంగోపాల్ వర్మ మరియు అల్లు అర్జున్ లాంటి ప్రముఖులు ఈ సినిమాను ఎంతగానో మెచ్చికున్నారు.ఈ విమర్శలు యానిమల్ సినిమా బాక్సాఫీస్ వసూళ్లపై మాత్రం ఎలాంటి ప్రభావం చూపడం లేదు.పది రోజులైనా యానిమల్ దూసుకెళ్తూనే ఉంది. ఈ సినిమా విడుదలైన మొదటిరోజు నుంచే ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను పరుగులు పెట్టిస్తుంది. వీక్ డేస్ లో కూడ హౌల్ఫుల్ షోస్‌తో ప్రదర్శితమౌతూ, కాసుల వర్షం కురిపిస్తోంది.రీసెంట్ గా యానిమల్ 8 రోజులకు గాను రూ. 600 కోట్ల మార్క్‌ను అందుకున్న విషయం తెలిసిందే..తాజాగా ఈ చిత్రం కేవలం 10 రోజులలో రూ.700 కోట్ల మార్క్‌ను అందుకుంది. ఈ చిత్రం ఆదివారం నాడు రూ.717 కోట్లు కలెక్షన్స్ సాధించినట్లు చిత్రబృందం ప్రకటించింది. కాగా, 10వ రోజైన ఆదివారం ఒక్క హిందీలోనే రూ. 87.56 కోట్ల వసూళ్లు సాధించింది. అయితే ఈ వీకెండ్ కూడా బాలీవుడ్‌లో పెద్ద సినిమాలేవి లేకపోవడంతో వెయ్యి కోట్లు వసూళ్లు చేయడం పక్కా అని తెలుస్తుంది.రణ్‌బీర్ కపూర్ కెరీర్లో ఇదే అత్యధిక కలెక్షన్స్ కావడం విశేషం. టీ-సిరీస్ ఈ విషయాన్ని తాజాగా వెల్లడించింది.
Also Read
- AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
- Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి విపక్షాల భారీ ప్లాన్..!
- YS Jagan: నేడు ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ
- Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ 'వెజ్ కీమా'.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
#Animal Conquering Box Office with Thunderous Records 🔥✊
Book your Tickets 🎟️https://t.co/kAvgndK34I#AnimalTakesOverTheNation #AnimalInCinemasNow #Animal #AnimalHuntBegins #BloodyBlockbusterAnimal #AnimalTheFilm @AnimalTheFilm @AnilKapoor #RanbirKapoor @iamRashmika… pic.twitter.com/6Izeug7H5Y
— Animal The Film (@AnimalTheFilm) December 11, 2023
తాజావార్తలు
-
Virat Kohli: ఇక విరాట్ కోహ్లీని ఎవరూ టచ్ చేయలేరు: కైఫ్
-
AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
-
Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి విపక్షాల భారీ ప్లాన్..!
-
YS Jagan: నేడు ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
ట్రెండింగ్
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!