Anil Ravipudi: అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా, నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌గారు’. ఈ క్రమంలో ఆదివారం తిరుపతిలో ‘మన శంకరవరప్రసాద్‌గారు’ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేశ్ కీ రోల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుబోతుంది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘‘తిరుపతి అంటే నాకు సెంటిమెంట్” అని చెప్పారు.
READ ALSO: AI chatbots: చాట్ జీపీటీ, గ్రోక్, జెమిని, ఇతర AI చాట్‌బాట్‌లను.. అడగకూడని విషయాలు ఇవే
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేంకటేశ్వస్వామి దయవల్ల తన కెరీర్ బాగుందన్నారు. ఈ మూవీకి వచ్చే ప్రతి ఫ్యాన్ ఎంతో హ్యాపీగా థియేటర్ నుంచి బయటకు వస్తాడని చెప్పారు. ఒక సగటు ఫ్యాన్‌గా చిరంజీవిగారిలో నాకు ఏం నచ్చుతాయో.. అలాంటి అంశాలతోనే ‘మన శంకరవరప్రసాద్‌గారు’ కథను రాశాను అని చెప్పారు. ఇది కేవలం రెండున్నర నిమిషాల ట్రైలర్ మాత్రమే అని, థియేటర్‌లో రెండున్నర గంటలకుపైగా సినిమా ఉంటుందని , ఆ టైమ్ మెషీన్‌లో ప్రతీ ప్యాన్ ఒక రౌండ్ వేసి వింటేజ్ చిరంజీవిని చూసి వస్తారని చెప్పారు. అలాగే ఆయన మాట్లాడుతూ.. ఈ చిత్ర సంగీత దర్శకుడు భీమ్స్‌కు స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. ‘సంక్రాంతి వస్తున్నాం’ తన కెరీర్‌లో స్పెషల్ ఫిల్మ్ అని గుర్తు చేసుకున్నారు. ఇది తన నాలుగో సంక్రాంతి సినిమా అని, తనను ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఆయన విక్టరీ వెంకటేశ్‌గారికి, హీరోయిన్ నయనతారకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గరపాటి, సుష్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
READ ALSO: LIC Jeevan Tarun Policy: LIC సూపర్ ప్లాన్ చూశారా! కేవలం రూ.150 ఆదా చేస్తే రూ.26 లక్షలు..