Anil Ravipudi: ప్రతిష్ఠాత్మక ‘సైమా’ 2025 (SIIMA – సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) అవార్డ్స్ వేడుక సెప్టెంబరు 5, 6 తేదీల్లో దుబాయ్ లో అంగరంగవైభవంగా జరగనుంది. ఈ వేడుకలకు సంబంధించిన ప్రెస్ మీట్ తాజాగా హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ… అందరికి నమస్కారం. భగవత్ కేసరి నా కెరీర్ లో చాలా స్పెషల్ ఫిలిం. సినిమాకి జాతి స్థాయిలో గుర్తింపు రావడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. నేషనల్ అవార్డు కమిటీకి జ్యూరీకి థాంక్యూ. సినిమాని నిర్మించిన సాహూ గారపాటి గారికి, పాయింట్ ని ఒప్పుకున్న మా బాలకృష్ణ గారికి ధన్యవాదాలు తెలిపారు.
Rahul Gandhi: రాజీవ్ గాంధీపై ‘చనిపోయిన వ్యక్తి’ పోటీ చేశారు.. రాహుల్‌గాంధీకి ఈ కథ తెలియదా..?
అలాగే ఆయన మాట్లాడుతూ.. సైమా విష్ణు గారితో నాకు చాలా మంచి అనుబంధం ఉంది. నా ఫస్ట్ మూవీ పటాస్ సినిమాకి ఆయన అవార్డు ఇవ్వడం ఇప్పటికీ మర్చిపోలేనన్నారు. ఆ ఫస్ట్ అవార్డు నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. లాస్ట్ ఇయర్ భగవంత్ కేసరి సినిమాకి బెస్ట్ ఫిల్మ్ కేటగిరీలో అవార్డు తీసుకున్నాను. ఆ అవార్డు తీసుకుంటున్నప్పుడే విష్ణు ఈ సినిమాకి నేషనల్ అవార్డు వస్తుందని వస్తుందని చెప్పినట్లు ఆయన అన్నారు.
UPI Payments: ఫోన్ పే, గూగుల్ పే వినియోగదారులకు షాక్.. త్వరలో ఆ సేవలు బంద్!
సైమా అవార్డ్స్ ఒరిజినల్ కంటెంట్ ని బట్టి అవార్డు ఇస్తారు. ఈ విషయంలో సైమాకి హ్యాట్సాఫ్ చెప్పాలి. ఇది కేవలం అవార్డులు వేడుకే కాదు నాలుగు భాషల సినీ టాలెంట్ ని కనెక్ట్ చేస్తుందన్నారు. డిఫరెంట్ టాలెంట్స్ అన్నీ ఒక వేదిక మీద కలవడం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. చాలా అద్భుతంగా ఈవెంట్ ని సెలబ్రేట్ చేస్తారని.. ఈ ఏడాది కూడా అద్భుతంగా జరగబోతుందంటూ, ఈ సందర్భంగా నేషనల్ అవార్డ్స్ విజేతలందరికీ అభినందనలు తెలిపారు.
