ప్రస్తుతం టాలీవుడ్‌లో అనిల్ రావిపూడి పేరు మారుమోగిపోతోంది. మొన్న సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవితో తీసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ. 360 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి తన సత్తా చాటారు. సంక్రాంతి సీజన్ అంటే చాలు అనిల్ రావిపూడికి తిరుగులేదని మరోసారి ప్రూవ్ అయ్యింది. దీంతో తాజాగా తన తదుపరి సినిమా గురించి అనిల్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.
Also Read : Jyothi Rai-Anil Ravipudi : జ్యోతిరాయ్ కోసం రంగంలోకి అనిల్ రావిపూడి..
‘నా నెక్స్ట్ సినిమా కోసం ఒక అదిరిపోయే ఐడియా దొరికింది. ఈసారి సినిమా టైటిల్ అనౌన్స్ చేసినప్పుడే మీరంతా షాక్ అవుతారు. ఆ పేరు వినగానే.. ‘వామ్మో వీడేంట్రా బాబూ.. మళ్ళీ ఏదో కొత్తగా మొదలుపెట్టాడు’ అని మీరు అనుకోవడం ఖాయం’ అని నవ్వుతూ చెప్పారు. అంటే, ఈసారి టైటిల్ చాలా విచిత్రంగా, మునుపెన్నడూ వినని విధంగా ఉండబోతోందని హింట్ ఇచ్చారు. అనిల్ రావిపూడికి, విక్టరీ వెంకటేష్‌కి ఉన్న బాండింగ్ గురించి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో F2, F3, సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వరప్రసాద్ గారు (ఇందులో వెంకీ కీలక పాత్ర చేశారు) వంటి నాలుగు హిట్లు వచ్చాయి.
ఇప్పుడు ఐదోసారి కూడా అనిల్ తన లక్కీ హీరో వెంకటేష్‌తోనే సినిమా చేయబోతున్నారని ఫిల్మ్ నగర్ టాక్. మళ్ళీ 2027 సంక్రాంతికే ఈ సినిమాను రిలీజ్ చేసేలా పక్కా ప్లాన్ రెడీ చేసుకున్నారట. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డేని తీసుకోవాలని అనిల్ అనుకుంటున్నారట. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఎందుకంటే, పూజా చేసిన గత కొన్ని సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. దీంతో నెటిజన్లు.. ‘అనిల్ గారు, పూజా హెగ్డేను తీసుకుని మీ సక్సెస్ గ్రాఫ్‌ను రిస్క్‌లో పడేయకండి.. ఆమె ‘ఐరన్ లెగ్’ సెంటిమెంట్ మీ హిట్ స్ట్రీక్‌ను దెబ్బతీస్తుందేమో ఆలోచించండి’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
