Anil Ambani: అనిల్ అంబానీకి ఎదురుదెబ్బలు.. సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనిల్ అంబానీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా తన గ్రూప్‌లోని ఒక సంస్థకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో అనిల్‌కు ఊహించని ఎదురుదెబ్బతో షాక్ అయ్యారు. రూ.8,000 కోట్లు కోల్పోవల్సిన దుస్థితి ఏర్పడింది. అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన అనుబంధ సంస్థ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు, ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ రూ.8,000 కోట్లు చెల్లించాల్సిన అవసరం లేదంటూ తాజాగా న్యాయస్థానం తీర్పునిచ్చింది. దీంతో అనిల్ అంబానీకి గట్టి షాక్ తగిలినట్టైంది. 2008లో ప్రపంచ కుబేరుల్లో ఆరో స్థానంలో ఉన్న అనిల్.. ప్రస్తుతం ఆ జాబితాలోనే కనిపించకుండా పోయారు. కొన్నేళ్లుగా ఆర్థికంగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తాజాగా సుప్రీంకోర్టు తీర్పు మరింత షాకిచ్చినట్లైంది.
2008లో రిలయన్స్ ఇన్‌ఫ్రాకు అనుబంధ కంపెనీ అయిన డీఏఎమ్‌ఈపీఎల్, ప్రభుత్వ రంగ సంస్థ డీఎమ్‌ఆర్‌సీలు ఒక కన్సెషన్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీనిపై వచ్చిన వివాదం విషయంలోనే డీఎమ్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా 2021లో సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. దానిపై డీఎమ్‌ఆర్‌సీ దాఖలు చేసిన క్యూరేటివ్ విజ్ఞప్తిని అంగీకరించిన ప్రత్యేక ధర్మాసనం.. తాజాగా అనిల్ అంబానీకి వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ సరైన నిర్ణయమే తీసుకుందని.. అందులో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టుకు ఎటువంటి కారణమూ కనిపించడం లేదని చెబుతూ అంత క్రితం ఇచ్చిన తీర్పును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం పన్కనపెట్టింది.
Also Read
- Ajit Doval: అరుణాచల్‌లో ఉద్రిక్తతల వేళ చైనాకు అజిత్ దోవల్..
- Pakistan: ఇద్దరు భారతీయులకు పాక్ అత్యున్నత పురస్కారం.. ఎందుకు ఇస్తోంది? జిన్నాతో సంబంధం ఏమిటి?
- Bangladesh: బంగ్లాదేశ్‌లో ఒకే హిందూ కుటుంబానికి చెందిన నలుగురు దారుణ హత్య?
- Weather Alert: ఈ నెల తొలిసారి వాతావరణ శాఖ భారీ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వర్షాలు
2017లో ఇచ్చిన తీర్పు ప్రకారం.. డీఏఎమ్‌ఈపీఎల్‌కు డీఎమ్‌ఆర్‌సీ రూ.2782.33 కోట్లు చెల్లించాలి. 2022 ఫిబ్రవరి 14 నాటికి ఒప్పంద నిబంధనల ప్రకారం ఇది రూ.8,009.38 కోట్లకు చేరింది. ఇందులో రూ.1678.42 కోట్లను డీఎమ్‌ఆర్‌సీ చెల్లించింది. మరో రూ.6,330.96 కోట్లు చెల్లించాల్సి ఉంది. తాజా తీర్పుతో అనిల్ కంపెనీ రూ.1678.42 కోట్లను డీఎమ్‌ఆర్‌సీకి వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో రూ.6,330.96 కోట్లనూ వదులుకోవాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
Zombie Reddy 2: ‘జోంబీ రెడ్డి’ సీక్వెల్ వచ్చేస్తోంది..ఈసారి తేజ సజ్జా రచ్చ మామూలుగా ఉండదు!
-
Ajit Doval: అరుణాచల్‌లో ఉద్రిక్తతల వేళ చైనాకు అజిత్ దోవల్..
-
Trump: ఇరాన్‌పై ట్రంప్ సరికొత్త యుద్ధం.. సముద్రం నుంచి భూమి వరకు పన్నిన భారీ వ్యూహం ఇదే!
-
CM Revanth Reddy : కేంద్ర ప్రభుత్వ తీరుపై రేవంత్ రెడ్డి ఆగ్రహం..
-
Honey Trap : రాజమహేంద్రవరంలో హనీ ట్రాప్ కలకలం.. నలుగురు మహిళలు అరెస్ట్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!