CM Revanth Reddy : కేంద్ర ప్రభుత్వ తీరుపై రేవంత్ రెడ్డి ఆగ్రహం..
- విదేశాంగ శాఖ అనుమతి నిరాకరణపై సీఎం ఆగ్రహం లండన్ నుంచే హైదరాబాద్‌కు రేవంత్ రెడ్డి పయనం ఖర్గేకు ధన్యవాదాలు.. మద్దతుగా నిలిచిన నేతలకు కృతజ్ఞతలు హైదరాబాద్‌కు వచ్చాక పూర్తి వివరాలు చెబుతానన్న సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ రాజకీయ కక్ష సాధింపు చర్యల వల్ల తన అమెరికా పర్యటన నిలిచిపోయిందని ఆరోపిస్తూ, లండన్ నుంచే నేరుగా హైదరాబాద్‌కు తిరుగుపయనమయ్యారు. ఈ విషయమై సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన, కేంద్ర వైఖరిని ఎండగట్టారు.
మద్దతుగా నిలిచిన ఖర్గేకు ధన్యవాదాలు.. నేడు హైదరాబాద్‌కు చేరుకోనున్న సీఎం
తన విదేశీ పర్యటనకు అనుమతి నిరాకరించడంపై స్పందించి, కేంద్ర వైఖరిని ప్రశ్నిస్తూ తనకు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే దేశవ్యాప్తంగా తన సమస్యపై స్పందించి మద్దతు తెలిపిన పార్టీ నాయకులకు, ప్రజలకు నా కృతజ్ఞతలు అని పేర్కొన్నారు.
Also Read
లండన్ టూర్ సక్సెస్.. విదేశీ పర్యటనల రద్దుపై హైదరాబాదులో క్లారిటీ
గత మూడు రోజులుగా లండన్‌లో నిర్వహించిన అన్ని అధికారిక కార్యక్రమాలు, సమావేశాలు విజయవంతంగా ముగిశాయని రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే, విదేశాంగ శాఖ నిర్ణయంతో బోస్టన్ షెడ్యూల్ రద్దు కావడంతో మరికొద్ది గంటల్లోనే హైదరాబాద్‌కు చేరుకోనున్నట్లు వెల్లడించారు. విదేశీ పర్యటనలకు అనుమతి నిరాకరణ, దాని వెనుక ఉన్న కారణాలు తదితర అంశాలపై హైదరాబాద్‌కు తిరిగొచ్చాక మీడియా ముందుకు వచ్చి మాట్లాడతానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
-
2027 ODI World Cup: భారత్, పాకిస్థాన్ మూడు సార్లు ఢీకొట్టే ఛాన్స్.. అదెలాగంటే?
-
Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
-
Blood Donation Camp: రక్తదాన శిబిరంలో ‘కులం’ కలకలం.. తమిళనాడులో వివాదం
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?