Zombie Reddy 2: ‘జోంబీ రెడ్డి’ సీక్వెల్ వచ్చేస్తోంది..ఈసారి తేజ సజ్జా రచ్చ మామూలుగా ఉండదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Zombie Reddy 2: ‘సూపర్ హీరో’ తేజ సజ్జా పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ వచ్చింది. ఆయన నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘జోంబీ రెడ్డి 2’ను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ‘జోంబీ రెడ్డి’కి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘జాంబీ రెడ్డి: నెక్ట్స్ లెవల్’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ అనౌన్స్మెంట్ వీడియోను విడుదల చేశారు. ఎలాంటి ఏఐ టెక్నాలజీని ఉపయోగించకుండా రూపొందించిన ఈ టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. బాలీవుడ్ డైరెక్టర్ సువర్ణ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, ప్రశాంత్ వర్మ క్రియేటర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఈసారి మరింత భారీ స్థాయిలో ‘జోంబీ-వర్స్’ను మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ‘బిగ్గర్, బాడర్ & బ్లడియర్’ కాన్సెప్ట్‌తో గత చిత్రానికి మించిన వయోలెన్స్, యాక్షన్‌తో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ‘డెడ్ ఆర్ అలైవ్’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ చిత్రం 2027లో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రియల్ స్టార్ ఉపేంద్ర, షనయ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తేజ సజ్జా మరోసారి జోంబీ ప్రపంచంలోకి అడుగుపెడుతుండటంతో ‘జోంబీ రెడ్డి 2’పై ఇప్పటినుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి.
Also Read
తాజావార్తలు
-
UPI Charges: అక్టోబర్ 2న ‘నో UPI డే’.. అసలు ఏం జరుగుతుంది?
-
Amaravati Construction: అమరావతి నిర్మాణంలో కీలక సమస్య..! కార్మికులపై అధికారుల దృష్టి
-
Jayant C Paranjee: ఆడదని ముందే తెలుసు.. పవన్ కళ్యాణ్ సినిమాపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!
-
Gandhi Jayanti 2026: గాంధీ జయంతి.. రాజ్‌ఘాట్‌లో బాపూజీకి ప్రధాని మోడీ ఘన నివాళులు
-
Car or Bike Buying Tips: కారు, బైక్ కొంటున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?