మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు.. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ గా ఉంది ఈ భామ.తెలుగు లో చేసిన ‘సీతారామం’ సినిమా లో ఆమె లుక్స్ కి అందరూ ఫిదా అయ్యారు.ఈ క్రమంలో నే ఇటీవలే ‘లస్ట్ స్టోరీస్ 2’ అనే బోల్డ్ వెబ్ సిరీస్ తో ఆడియెన్స్ ను అలరించింది.ఈ సిరీస్ లో మృణాల్ ఠాకూర్ హీరో అంగద్ బేడీతో కలిసి బోల్డ్ సీన్స్ లో నటించింది.అయితా తాజాగా ఈ ముద్దగుమ్మ గురించి నటుడు అంగద్ బేడీ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.మృణాల్ ద్వారా చాలా నేర్చుకున్నాను అంటూ మృణాల్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఆమె ఎంతో బ్యూటీ ఫుల్ లేడీ అంటూ పొగిడారు.తన తో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.నా దృష్టిలో మృణాల్ మంచి వ్యక్తిత్వం ఉన్న నటి అని సహ నటుడి గా ఆమె తో నటించడం వల్ల..నన్ను నేనేంటో బాగా తెలుసుకున్నాను.
ఆ సిరీస్ లో మా ఇద్దరి ఎపిసోడ్ అంత బాగా వచ్చిందంటే అందుకు కారణం మృణాల్ అని అంగద్ తెలిపాడు.. ఆ క్రెడిట్ అంతా ఆమెకె సొంతం అని ఆయన తెలిపారు.. స్క్రీన్ పై మా ఇద్దరి పెయిర్ ఆడియెన్స్ కి బాగా నచ్చింది.ఆమె తో కలిసి మరిన్ని సినిమాలు చేయాలని ఉంది అని అంగద్ బేడీ తెలిపారు.ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ తెలుగు లో నానితో ఒక సినిమాను చేస్తుంది. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ దశ లో ఉంది.ఈ సినిమా కోసం ఆమె దాదాపు 3 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి.డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం లో విజయ్ దేవరకొండ సినిమా లో కూడా ఆఫర్ ను దక్కించుకుంది.. ఈ సినిమాకు కూడా మృణాల్ ఠాకూర్ భారీ గా డిమాండ్ చేసినట్లు సమాచారం.