Site icon NTV Telugu

Yuganiki Okkadu 2: ‘యుగానికి ఒక్కడు 2’ సీక్వెల్‌పై ఆండ్రియా షాకింగ్ కామెంట్స్!

Yuganiki Okkadu 2 Andrea Jeremiah

Yuganiki Okkadu 2 Andrea Jeremiah

తమిళ హీరో కార్తీ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన ‘యుగానికి ఒక్కడు’ సినిమాకు సీక్వెల్ రాబోతుందనే వార్త ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ఈ సినిమా తమిళం కంటే తెలుగులోనే పెద్ద విజయాన్ని అందుకుని కల్ట్ హోదాను సంపాదించుకుంది. ఈ క్రేజ్ దృష్ట్యా, సెల్వరాఘవన్ తన తమ్ముడు ధనుష్‌ను హీరోగా పెట్టి పార్ట్-2ని గతంలోనే ప్రకటించారు. సమాచారం ప్రకారం, సెల్వరాఘవన్ ఈ సీక్వెల్ స్క్రిప్ట్ పనులను దాదాపు పూర్తి చేశారట. 2026 చివర్లో లేదా అంతకంటే ముందే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాల సమాచారం. ధనుష్ ప్రస్తుతం తన ఇతర కమిట్‌మెంట్స్‌తో బిజీగా ఉండటం వల్లే ఈ ఆలస్యం జరుగుతోంది. అయితే, ఈ సీక్వెల్‌లో మొదటి భాగంలో నటించిన వారు ఉంటారా లేదా అనే దానిపై తాజాగా నటి ఆండ్రియా క్లారిటీ ఇచ్చేసింది.

Also Read : Rakasa: ‘పెద్ది’ సెట్స్‌లో ‘రాకాస’ సందడి.. టీమ్‌కు రామ్ చరణ్ స్పెషల్ బూస్ట్!

ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘నా నుండి యుగానికి ఒక్కడు 2 ఆశించవద్దు. ఆ సినిమా జరిగితే మంచిదే, కానీ అందులో నేను ఉండను. ఎందుకంటే సెల్వరాఘవన్ సార్‌తో పనిచేయడం చాలా కష్టం. మొదటి భాగం కోసం మేము ఏకంగా 200 రోజులు షూటింగ్‌లో పాల్గొన్నాము’ అని కుండబద్దలు కొట్టింది. కానీ ఆ సినిమా షూటింగ్ సమయంలో పడిన కష్టం వల్లే ఆ తర్వాత తను చేసిన ఏ పాత్రనైనా చాలా సులభంగా చేయగలిగానని ఆమె పేర్కొంది. ఆండ్రియా తప్పుకోవడంతో, ఈ సినిమాలో ధనుష్ సరసన కొత్త హీరోయిన్ ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Exit mobile version