Yuganiki Okkadu 2: ‘యుగానికి ఒక్కడు 2’ సీక్వెల్‌పై ఆండ్రియా షాకింగ్ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ హీరో కార్తీ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన ‘యుగానికి ఒక్కడు’ సినిమాకు సీక్వెల్ రాబోతుందనే వార్త ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ఈ సినిమా తమిళం కంటే తెలుగులోనే పెద్ద విజయాన్ని అందుకుని కల్ట్ హోదాను సంపాదించుకుంది. ఈ క్రేజ్ దృష్ట్యా, సెల్వరాఘవన్ తన తమ్ముడు ధనుష్‌ను హీరోగా పెట్టి పార్ట్-2ని గతంలోనే ప్రకటించారు. సమాచారం ప్రకారం, సెల్వరాఘవన్ ఈ సీక్వెల్ స్క్రిప్ట్ పనులను దాదాపు పూర్తి చేశారట. 2026 చివర్లో లేదా అంతకంటే ముందే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాల సమాచారం. ధనుష్ ప్రస్తుతం తన ఇతర కమిట్‌మెంట్స్‌తో బిజీగా ఉండటం వల్లే ఈ ఆలస్యం జరుగుతోంది. అయితే, ఈ సీక్వెల్‌లో మొదటి భాగంలో నటించిన వారు ఉంటారా లేదా అనే దానిపై తాజాగా నటి ఆండ్రియా క్లారిటీ ఇచ్చేసింది.
Also Read : Rakasa: ‘పెద్ది’ సెట్స్‌లో ‘రాకాస’ సందడి.. టీమ్‌కు రామ్ చరణ్ స్పెషల్ బూస్ట్!
Also Read
ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘నా నుండి యుగానికి ఒక్కడు 2 ఆశించవద్దు. ఆ సినిమా జరిగితే మంచిదే, కానీ అందులో నేను ఉండను. ఎందుకంటే సెల్వరాఘవన్ సార్‌తో పనిచేయడం చాలా కష్టం. మొదటి భాగం కోసం మేము ఏకంగా 200 రోజులు షూటింగ్‌లో పాల్గొన్నాము’ అని కుండబద్దలు కొట్టింది. కానీ ఆ సినిమా షూటింగ్ సమయంలో పడిన కష్టం వల్లే ఆ తర్వాత తను చేసిన ఏ పాత్రనైనా చాలా సులభంగా చేయగలిగానని ఆమె పేర్కొంది. ఆండ్రియా తప్పుకోవడంతో, ఈ సినిమాలో ధనుష్ సరసన కొత్త హీరోయిన్ ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?