Gongura Pickle Recipe: ఏడాది పాటు నిల్వ ఉండే ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి.. అన్నంలో నెయ్యితో కలుపుకొని తింటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Style Gongura Pickle Recipe: గోంగూరతో చేసే వంటకాలు ఆంధ్ర వంటల్లో ఓ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటాయని అనడంలో ఎంటువంటి అనుమానం లేదు. ముఖ్యంగా గోంగూర నిల్వ పచ్చడి రుచి గురించి ఇక సపరేట్ గా చెప్పాల్సిన పనిలేదు. అంతే వేడి వేడి అన్నంలో కొద్దిగా గోంగూర పచ్చడి, పైగా నెయ్యి వేసి కలిపితే అసలు రుచి తెలుస్తుంది. కాబట్టి దీనిని సరైన కొలతల్లో, సరైన విధానంలో తయారు చేస్తే ఏడాది పాటు నిల్వ ఉంచుకుని ఎప్పుడైనా ఆస్వాదించవచ్చు. మరి పక్కా కొలతలతో ఆంధ్ర స్టైల్ లో ఈ రుచికరమైన గోంగూర నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా..
సాధారణంగా గోంగూర రెండు రకాలుగా ఉంటుంది. ఇందులో మొదటిది పుల్ల గోంగూర. ఇది మార్కెట్‌లో ఎక్కువగా దొరికేది. పులుపు ఎక్కువగా ఉంటుంది. మరొకటి తెల్ల గోంగూర.ఇది కాస్త పులుపు తక్కువగా ఉంటుంది. అందుకే దీనితో పచ్చడి చేస్తే చింతపండు కొంచెం ఎక్కువగా వేయాల్సి వస్తుంది. ఈ రెసిపీలో సాధారణంగా దొరికే పుల్ల గోంగూరను ఉపయోగించడం మంచిది.
Also Read
కావలసిన పదార్థాలు:
* గోంగూర ఆకులు – 500 గ్రాములు
* ఎండుమిరపకాయలు – 100 గ్రాములు
* ధనియాలు – 2 టీ స్పూన్లు
* ఆవాలు – 2 టీ స్పూన్లు
* మెంతులు – 1 టీ స్పూన్
* జీలకర్ర – 1 టీ స్పూన్
* కల్లు ఉప్పు – 50 గ్రాములు
* వెల్లుల్లి – 50 గ్రాములు
* చింతపండు – 35 గ్రాములు
* వేరుశెనగ నూనె – అవసరమైనంత
తాలింపు కోసం:
* వేరుశెనగ నూనె – 1 కప్పు (సుమారు 250 ml)
* శనగపప్పు, మినప్పప్పు – మీకు కావలిసినంత
* ఆవాలు, జీలకర్ర – తలా కొద్దిగా
* ఎండుమిర్చి – 4
* కరివేపాకు – 3 రెమ్మలు
* పసుపు – అర టీ స్పూన్
* ఇంగువ – పావు టీ స్పూన్
Brad Haddin: అభిషేక్ శర్మ ఓ ‘రాస్కల్’.. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
తయారీ విదానం:
గోంగూర ఆకులు సిద్ధం చేయడం:
ముందుగా గోంగూర ఆకులను కాడలు తీసి ఆకులు మాత్రమే వేరు చేసుకోవాలి. ఆకులను రెండు మూడు సార్లు బాగా కడిగి ఇసుక పూర్తిగా తొలగించాలి. తర్వాత ఒక పొడి గుడ్డపై లేదా ఫ్యాన్ గాలిలో ఆకులను పరచి పూర్తిగా ఆరబెట్టాలి. ఆకుల్లో చెమ్మ ఉండకూడదు.
మసాలా దినుసులు వేయించడం:
ఒక కడాయి తీసుకొని అందులో ధనియాలు, ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసి తక్కువ మంటపై దోరగా వేయించి చల్లారనివ్వాలి. వాటిని పక్కను పెట్టుకొని అదే కడాయిలో కొద్దిగా నూనె వేసి ఎండుమిరపకాయలను కూడా తక్కువ మంటపై వేయించి పక్కన పెట్టాలి.
మసాలా పొడి తయారీ:
మిక్సీలో ముందుగా వేయించిన దినుసులను వేసి పొడిగా గ్రైండ్ చేయాలి. తర్వాత కల్లు ఉప్పు వేసి మళ్లీ మెత్తగా పొడి చేసుకోవాలి. అదే మిక్సీలో ఎండుమిరపకాయలను వేసి కాస్త బరకగా గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత వెల్లుల్లిని కూడా కాస్త కోర్స్ గా గ్రైండ్ చేసి మసాలాలో కలపాలి.
Egg Prices Drop: యుద్ధానికి గుడ్లతో ఉన్న లింకేంటి..? భారత్‌లో గుడ్ల ధర ఎందుకు పడిపోయింది..?
గోంగూర వేయించడం:
మొదటగా శుభ్రంగా ఉన్న ఓ కడాయిలో 2 లేదా 3 టేబుల్ స్పూన్లు వేరుశనగ నూనె వేసి వేడి చేయాలి. అందులో గోంగూర ఆకులు, చింతపండు వేసి కలుపుతూ మగ్గించాలి. ఆకుల్లోని తేమ పూర్తిగా పోయి కాస్త ఉడికే వరకు వేయించాలి. పూర్తిగా గుజ్జు చేయాల్సిన అవసరం లేదు.
గోంగూర తొక్కు తయారీ:
చల్లారిన గోంగూరలో కొంత భాగం మిక్సీలో వేసి కోర్స్‌గా గ్రైండ్ చేయాలి. దాన్ని మిగిలిన గోంగూరలో కలిపి ముందుగా తయారు చేసిన మసాలా పొడిని వేసి బాగా కలపాలి. ఇలా తయారైనది గోంగూర తొక్కు. దీనిని జాడీలో నిల్వ ఉంచితే చాలా కాలం చెడిపోదు.
తాలింపు పెట్టడం:
పాన్‌లో నూనె వేడి చేసి అందులో శనగపప్పు, మినప పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి దోరగా వేయించాలి. తర్వాత పసుపు, ఇంగువ వేసి ఈ తాలింపును పచ్చడిలో కలపాలి. అవసరమైతే ఉప్పు కూడా సరిచేసుకోవచ్చు.
నిల్వ విధానం:
పచ్చడిని పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ బాటిల్ లో వేసి ఫ్రిజ్‌లో ఉంచితే సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. లేదంటే తొక్కును మాత్రమే నిల్వ ఉంచుకుని తినేటప్పుడు కొద్దిగా తీసుకుని తాజా తాలింపు వేసుకుని వాడుకోవచ్చు.
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..