NTV Telugu Site icon

Rs 20,000 Fine For Driving With Earphones: ఇయర్ ఫోన్స్ పెట్టుకొని డ్రైవింగ్‌ చేస్తే రూ.20 వేల ఫైన్‌..? అసలు విషయం ఇదే..

Earphones

Earphones

Rs 20,000 Fine For Driving With Earphones: డ్రైవింగ్‌ చేసేటప్పుడు ఏకాగ్రత ఎంతో ముఖ్యం.. నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేస్తే.. ఎవరి ప్రాణాలకైనా ముప్పు తప్పకపోవచ్చు.. ఇక, హెడ్‌సెట్‌లు, బ్లూటూత్‌లు, ఇయర్‌బడ్స్.. ఇలా రకరకాల టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత.. అవి ధరించి డ్రైవింగ్‌ చేసేవాళ్లు వెనకాల నుంచి ఎవరైనా హారన్‌ కొట్టినా.. చుట్టుపక్కల ఏదైనా జరిగినా వెంటనే గుర్తించలేని స్థితిలోకి వెళ్లిపోతున్నారు.. హెడ్‌సెట్‌ పెట్టుకుని ఫోన్లు మాట్లాడేవారు కొందరైతే.. మ్యూజిక్‌ ఎంజాయ్‌ చేసేవాళ్లు ఎంతో మంది ఉన్నారు.. ఇలా చాలా మంది కోరి ప్రమాదాలు తెచ్చుకుంటున్నారు.. అయితే, వీటికి చెక్‌ పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి.. ఇకపై బైక్ మీద కానీ, కారులో కానీ, ఆటోలో కానీ.. ఇయర్‌ఫోన్స్ లేదా హెడ్‌సెట్ పెట్టుకుంటే రూ.20,000 జరిమానా విధించాలని నిర్ణయం తీసుకున్నట్టు సోషల్‌ మీడియాలో ఓ వార్త హల్‌ చల్‌ చేస్తోంది.. ఇది ఆగస్టు నెల నుంచి అమల్లోకి వస్తుందని పలు వాట్సప్‌ గ్రూపుల్లో వైరల్‌ అయ్యింది.

Read Also: Visakhapatnam: 8 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం.. విశాఖ కోర్టు సంచలన తీర్పు

అయితే, ఏపీ రవాణాశాఖ తీసుకున్న నిర్ణయం సోషల్‌ మీడియాలో వైరల్‌ కాగా.. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.. రూల్స్‌ పాటిస్తే.. ఈ ఫైన్ల గొడవ ఉండదని కొందరు చెబుతుంటూ.. సామాన్యులను బతకనివ్వరా? హెడ్‌సెట్‌ పెట్టుకుంటే రూ.20వేలు జరిమానా విధిస్తారా? ఇదేమైనా న్యాయంగా ఉందా అంటూ నిలదీసేవాళ్లు మరికొంతమంది.. ఇక, సోషల్‌ మీడియాలో జరుగుతోన్న ఆ ప్రచారంపై ఏపీ రవాణా శాఖ కమిషనర్ స్పందించారు.. ఇదంతా వట్టిదేనని కొట్టిపారేశారు.. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకే రాష్ట్రంలో సవరించిన జరిమానాలు వసూలు చేస్తున్నట్టు క్లారిటీ ఇచ్చారు.. అయితే, మోటార్‌ వెహికిల్‌ యాక్ట్‌ ప్రకారం ఇయర్ ఫోన్ లేదా హెడ్ ఫోన్ పెట్టుకుని వాహనం నడుపుతూ దొరికిపోతే మొదటిసారి రూ. 1500 నుంచి రూ. 2 వేల వరకు జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు.. అంతేకాదు.. ఇలా పదేపదే పట్టుబడితే రూ.10 వేల వరకు జరిమానా విధించే అవకాశం కూడా ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఈ నిబంధనలు.. ఎంతో కాలం నుంచి అమలు చేస్తున్నామని.. జరిమానా పెంపు ఆలోచన మాత్రం లేదని స్పష్టం చేశారు ఏపీ రవాణా శాఖ కమిషనర్.