Site icon NTV Telugu

Home Minister Anitha: కాలినడకన తిరుమల చేరుకున్న హోంమంత్రి అనిత

Anitha

Anitha

Home Minister Anitha: ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. నడకదారి భక్తులకు సులభతరంగా దర్శనభాగ్యం కల్పించేందుకు దర్శన టోకెన్లు జారీ చేయాలని టీటీడీ అధికారులకు హోంమంత్రి సూచించారు. నడకదారి భక్తులకు భధ్రత కల్పించేందుకు పెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నరసాపురం ఎంపీడీఓ ఆచూకీ కోసం ఎన్డీఆర్ఏఫ్ బృందాలతో గాలింపు చేపడుతున్నామన్నారు. ఎంపీడిఓ కుటుంభానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఉద్యోగులపై ఒత్తిడి లేకుండా విధులు నిర్వర్తించేందుకు మా ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందన్నారు.

Read Also: Odisha: వైద్యం పేరుతో మహిళ తలలో 18 సూదులు గుచ్చిన తాంత్రికుడు..

మరో వైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేపథ్యంలో ఏపీ సర్కారు అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో మంత్రి అనిత అధికారులను అప్రమత్తం చేశారు. ప్రజలకు నష్టం వాటిల్లకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. వర్షాలు, వరద ప్రభావం ఎక్కువగా ఉన్న ఏలూరు, అనకాపల్లి జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి తీసుకుంటున్న చర్యలపై మంత్రి అనిత తీశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు.

 

Exit mobile version