Andhra Pradesh High Court: R-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాలను నిలిపి వేయాలని.. దాని కోసం మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటూ దాఖలైన అనుబంధ పిటిషన్లపై తీర్పు రిజర్వ్ చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం.. ఇరు వర్గాల వాదనలు ముగియటంతో తీర్పు రిజర్వ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది ధర్మాసనం.. ఇళ్ల పట్టాలు ఇవ్వటానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చినట్టు కోర్టుకు తెలిపింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అయితే, ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చిందా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ధర్మాసనం.. ఇళ్ల నిర్మాణం కూడా చేపడతామని సుప్రీంకోర్టుకి ఇచ్చిన పిటిషన్ లో పేర్కొన్నట్టు కోర్టుకు తెలిపింది ప్రభుత్వం.. ఇక, తుది తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే ప్రజా ధనం వృధా అవుతుంది కదా? అని ప్రశ్నించింది ధర్మాసనం.. ఇక, అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను ఎక్కడైనా ఇవ్వాల్సిందే అని ఈ సందర్భంగా హైకోర్టుకు తెలిపింది ప్రభుత్వం.. తీర్పు వ్యతిరేకంగా వస్తే ఇక్కడ ఇళ్లను నిర్మించిన భూములకు ప్రత్యామ్నాయంగా వేరే చోట CRDAకి భూములు ఇస్తామని కోర్టుకు తెలిపింది ప్రభుత్వం.. అయితే, ఈ కేసులో ఇరు వర్గాల వాదనలు ముగియడంతో.. తీర్పు రిజర్వ్ చేసింది ఏపీ హైకోర్టు..
Read Also: Gyanvapi Case: జ్ఞాన్‌వాపి మసీదు కార్బన్ డేటింగ్‌కు వారణాసి కోర్టు అనుమతి