Site icon NTV Telugu

Heavy Rains : అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షలు.. అప్రమత్తమైన ప్రభుత్వం

Heavy Rains

Heavy Rains

రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని హోంమంత్రి తానేటి అనిత తక్షణమే స్పందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్‌తో ఫోన్‌లో మాట్లాడి తాజా పరిస్థితిపై సమాచారం తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను అప్రమత్తం చేస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేసి, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.

READ MORE: CRPF Man: ‘‘పాకిస్తాన్ మహిళ‌తో పెళ్లితో ఉద్యోగం పోయింది’’.. ప్రధాని మోడీ సాయం కోరిన సీఆర్‌పీఎఫ్ మాజీ కానిస్టేబుల్..

సహాయక చర్యలు చేపట్టేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని హోంమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆమె అధికారులను ఆదేశించారు. తాగునీరు, విద్యుత్ వంటి అవసరమైన సేవల సరఫరాలో ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా తీసుకోవాల్సిన చర్యలను ఆమె సూచించారు.

READ MORE: Pakistani YouTuber: ‘‘వారిని సె*క్స్ బానిసలుగా చేయాలనుకుంటున్నా’’ పాక్ యూట్యూబర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు..

Exit mobile version