ఈ మధ్య కాలంలో బుల్లి తెర యాంకరమ్మలు ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు.. అందరి మాట పక్కన పెడితే సుమక్క మాత్రం గత కొన్నిరోజులుగా గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.. తాజాగా బ్లాక్ ట్రేండి వేర్ లో ఫోటో షూట్ చేసింది.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
ప్రస్తుతం సుమక్క కేవలం రెండు షోలు మాత్రమే చేస్తుంది.. సుమ అడ్డా, అమ్మ ఆవకాయ్ వంటి రెండు షోలు మాత్రమే చేసింది.. అయితే ఆమె సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ ఫ్యాన్స్ కి తనలోని తెలియని కోణం పరిచయం చేస్తుంది. తాజాగా లేటెస్ట్ డిజైనర్ వేర్ ధరించి సూపర్ గ్లామరస్ గా దర్శనమిచ్చింది. ఆమె ఫోటోలు వైరల్ గా మారాయి..
గత పాతికేళ్లుగా సుమ స్టార్ యాంకర్ హోదాలో కొనసాగుతున్నారు. సుమ షోలో ఉన్నారంటే వినోదం పరుగులు పెడుతుంది. ఆమె టైమింగ్ పంచ్లు షోకి హైలెట్ గా నిలుస్తాయి. అందుకే దశాబ్దాలుగా ఆమె ప్రస్థానం సాగుతుంది.. సుమ పలు భాషల్లో కూడా మాట్లాడుతుంది.. సుమ రాజీవ్ కనకాలను ప్రేమ వివాహం చేసుకుంది. ఇటీవ ఆమె రాజీవ్ కనకాలతో విడిపోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇద్దరూ విడివిడిగా ఉంటున్న నేపథ్యంలో మనస్పర్థలు తలెత్తాయంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలను రాజీవ్ కనకాల ఖండించారు.. ఇక సుమకు ఇద్దరు పిల్లలు.. తన కొడుకును కూడా సినిమాల్లోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉందని తెలుస్తుంది..