తెలుగు ప్రేక్షకులకు యాంకర్ సుమ పేరుకు పెద్దగా పరిచయాలు అవసరం లేదు… తన యాంకరింగ్ తో అందరిని ఆకట్టుకుంది.. అందుకే ఇప్పటివరకు ఇండస్ట్రీలో కొనసాగుతుంది.. ఎన్నో టీవీ షోలు మరియు సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేస్తున్న పలు సినిమాల్లో కూడా కనిపించింది.. సుమ యాంకర్ గానే కాదు నటిగా మొదట్లో కొన్ని సినిమాలు చేసిందని అందరికి తెలిసిందే.. అతి తక్కువ మందికి మాత్రమే సినిమాల గురించి తెలిసే ఉంటుంది.. అందులో స్వర్గీయ నటి సౌందర్య తో కలిసి ఓ సినిమాలో కూడా నటించిందట ఆ సినిమా గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
1996 లో వచ్చిన కల్యాణ ప్రాప్తిరస్తు సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.. ఆ తర్వాత హీరోయిన్ గా కనిపించలేదు.. సినిమాలో కొన్ని పాత్రల్లో నటించింది.. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది.. ప్రభాస్ నటించిన వర్షం సినిమాలో అక్కగా నటించింది.. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. చిన్న చిన్న పాత్రల్లో కనిపించి మెప్పించింది.. రీసెంట్ గా జయమ్మ పంచాయితీ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. సుమ కొడుకు రోషన్ ఇటీవలే హీరోగా టాలీవుడ్ కి పరిచయమైన సంగతి తెలిసిందే. బబుల్ గమ్ అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు.
ఇదిలా ఉండగా.. హీరోయిన్ సౌందర్య తో కలిసి ఓ సినిమాలో కూడా సుమ నటించింది.. ఆ సినిమా గురించి అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు.. ఆ సినిమా ‘కలిసి నడుద్దాం’.. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన సినిమా సూపర్ హిట్ అయ్యింది.. ఆ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా నటించింది. ఈ సినిమా గురించి విన్న సుమ ఫ్యాన్స్ సంతోష పడుతున్నారు.. ఇకపోతే ప్రస్తుతం సుమ యాంకరింగ్ చేస్తూ బిజీగా ఉంది.. ఇటీవల సోషల్ మీడియాలో గ్లామర్ మెరుపులు మెరిపిస్తుంది.. ఆ ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతుంది..