Anasuya : యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసి యాక్టర్ గా సెటిల్ అయిపోయింది అనసూయ. ప్రస్తుతం పెద్ద సినిమాల్లో విలన్ పాత్రలు, ఇతర కీలక పాత్రలు చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తోంది. అయితే ఆమెను ఆంటీ అనే వివాదం ఎప్పుడూ వెంటాడుతూనే ఉంది. గతంలో దానికి ఆమె పులిస్టాప్ పెట్టాలని చూసింది. తనను ఆంటీ అని పిలిచే వారిపై అప్పట్లో కంప్లయింట్ కూడా చేసింది. అప్పటి నుంచి ఆమె ఇలాంటి వివాదాలకు కొద్దిగా దూరంగా ఉంటుంది. అయితే తాజాగా ఓ హోలీ ఈవెంట్ కు వెళ్లగా అక్కడ కూడా ఇదే అనుభవం ఆమెకు ఎదురైంది.
Read Also : Harish Shankar : ఇదే నీ సంస్కారం.. దేవి శ్రీపై హరీశ్ శంకర్ సంచలన పోస్ట్
అక్కడ ఓ వ్యక్తి ఆమెను ఆంటీ అంటూ పిలిచాడు. జనం మధ్యలో ఉన్న ఆ వ్యక్తిని అనసూయ గుర్తించింది. వెంటనే మైక్ తీసుకుని నేను నీ ప్లేస్ ను గుర్తించా. దమ్ముంటే పైకి రా అంటూ ఆమె హిందీలో అనడంతో అందరూ అరిచేశారు. అనసూయ అతనికి చేతి సైగలు కూడా చేసింది. ఏమైంది రావడానికి భయం అవుతోందా అన్నట్టు ఆమె సైగలు చేసింది. వెంటనే అక్కడున్న నిర్వాహకులు ఊ అంటావా మావ పాటను ప్లే చేయడంతో అనసూయ ఎక్స్ ప్రెషన్స్ మార్చేసింది.