బుల్లితెర పై యాంకర్ గా ఓ వెలుగు వెలిగిన అనసూయ ఇప్పుడు యాంకరింగ్ కు పూర్తిగా గుడ్ బై చెప్పేసి ప్రస్తుతం నటిగా బిజీగా ఉంది.. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతుంది.. ఒకవైపు బిజీగా ఉన్నా కూడా మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో పాటుగా, హాట్ లుక్స్ ఉన్న ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.. తాజాగా షేర్ చేసిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..
బుల్లితెరపై యాంకర్ గానే అలరిస్తూనే మరోవైపు అందచందాలతో ఆడియెన్స్ ను మంత్రముగ్ధులను చేసింది. తన డాన్స్ తో కట్టిపడేసింది.. ఈ క్రమంలో సినిమాల్లోనూ అవకాశాలు అందుకొని నటిగా మారింది. తొలుత స్పెషల్ అపియరెన్స్ తో వెండితెరపై సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ.. క్రమంగా స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.. సుకుమార్ తెరకేక్కించిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా నటించి బాగా ఫెమస్ అయ్యింది..
ఆ తర్వాత వచ్చిన ‘పుష్ప’లో మాస్ రోల్ పోషించి అందరినీ ఆశ్చర్యపరిచింది. రీసెంట్ గా వచ్చిన ‘రంగమార్తాండ’, ‘విమానం’ చిత్రాల్లోనూ కీలక పాత్రల్లో నటించి మెప్పించింది. ఇలా వరుస సినిమాలతో వెండితెరపై సందడి చేస్తూనే ఉంది.. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. అవి ఎంతగా వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. తాజాగా బ్లాక్ గౌన్ లో అదిరిపోయే లుక్ ను సొంతం చేసుకుంది. నయా లుక్ లో మెరుపులు మెరిపించింది. అలాగే కొంటె ఫొజులతో కుర్ర హృదయాలను కట్టిపడేసింది. క్లోజప్ లో పిక్స్ తో మెస్మరైజ్ చేసింది.. ప్రస్తుతం అనసూయ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప2 : ది రూల్’లో నటిస్తోంది… వచ్చే ఏడాది రిలీజ్ కాబోతుంది..