యాంకర్ అనసూయ ఏం చేసిన టైం ప్రకారం చేస్తుంది.. ఏదైనా చెయ్యాలి అది పూర్తి చేసేంతవరకు ఆమె నిద్రపట్టదని చాలా సందర్భాల్లో చెప్పింది..ఆమె ఇచ్చిన సినిమాల విషయంలో కూడా అంతే.. ఏ టైం అయినా పెద్దగా పట్టించుకోదు.. తాజాగా ఓ సినిమా షూటింగ్ లో పాల్గొన్న అమ్మడు కొత్త ప్రాజెక్ట్ కోసం తెగ కష్టపడుతున్నారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కి తెలియజేశారు. ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో ఫోటోలు, వీడియోలు షేర్ చేశారు. అర్థరాత్రి మొదలైన షూటింగ్ తెల్లవారుజాము వరకు నాన్ స్టాప్ గా కొనసాగిందట. బాగా అలసిపోయనంటూ డల్ గా ఉన్న ఫోటో షేర్ చేశారు. ఆ ఫొటోలే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి..
అనసూయ ప్రస్తుతం నటిస్తున్న ఆ ప్రాజెక్ట్ వివరాలు ఆమె చెప్పలేదు. అయితే అద్భుతమైన పాత్ర దక్కింది అంటున్నారు. ఇలాంటి అరుదైన గొప్ప పాత్రలు ఇచ్చి ప్రోత్సహిస్తున్న మేకర్స్, ఆడియన్స్ కి ధన్యవాదాలు అని ఆమె చెప్పుకొచ్చారు. అనసూయ లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్స్ ఆసక్తి రేపుతున్నాయి..ఇక మొన్నీ మధ్య రిలీజ్ అయిన విమానం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీలో అనసూయ వేశ్య రోల్ చేయడం కొసమెరుపు. అలాంటి ఛాలెంజింగ్ రోల్ చేసేందుకు ముందుకు రావడమే కాకుండా, అత్యంత సహజంగా నటించి మెప్పించింది. విమానంలో మూవీలో అనసూయ పాత్రకు ప్రశంసలు దక్కాయి..
ఇప్పుడు అనసూయ మార్కెట్ పెరిగింది..దాంతో వచ్చిన ఆఫర్స్ ను కాదనకుండా సినిమాలు చేస్తూ వస్తుంది..అల్లు అర్జున్ నటించిన పుష్ప 2పై భారీ అంచనాలు ఉన్నాయి. వేర్ ఈజ్ పుష్ప కాన్సెప్ట్ టీజర్ ఆకట్టుకుంది. పుష్ప 2 శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.. ఇందులో అదే పాత్రలో నటించనుంది..ఇక యాంకరింగ్ కు గుడ్ బై చెప్పేసిన ఈ అమ్మడు ఇప్పుడు వెండి తెరపై వరుస అవకాశాలను అందుకుంటుంది..అదే సమయంలో అనసూయ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. అనసూయ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ నుండి వ్యతిరేకత ఎదుర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా అనసూయ-విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య యుద్ధం నడిచింది.. ప్రస్తుతం ఈ గొడవ సర్దు మణిగింది..