Anasuya: అనసూయపై కామెంట్స్..జర్నలిస్టులు సహా 42 మందిపై కేసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anasuya: టాలీవుడ్ ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ మరోసారి వార్తల్లో నిలిచారు, తనపై జరుగుతున్న ఆన్లైన్ వేధింపులు, మార్ఫింగ్ ఫోటోలు అసభ్యకర ప్రచారానికి వ్యతిరేకంగా ఆమె చట్టపరమైన పోరాటానికి దిగారు. తన పరువుకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్నారంటూ అనసూయ ఏకంగా 42 మందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందులో సినీ నిర్మాతలు, జర్నలిస్టులు, టీవీ ఛానెళ్ల యాంకర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఉండటం గమనార్హం. తాజా సమాచారం ప్రకారం, సైబర్ క్రైమ్ పోలీసులు ఈ వ్యవహారంలో మొత్తం 73 మందిపై కేసులు నమోదు చేశారు.
READ ALSO: Anil Ravipudi: అనిల్ రావిపూడికి మైండ్ బ్లాకయ్యే రెమ్యునరేషన్ ఆఫర్ .. రెవెన్యూ షేర్!
Also Read
- Army Chief: ‘‘భూమిపై ఉంటారా.? చరిత్రలో కలుస్తారా.?’’ పాకిస్తాన్‌కు ఆర్మీ చీఫ్ వార్నింగ్..
- Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
- AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్‌తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
- Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
అనసూయ పేర్కొన్న ప్రకారం, కేవలం విమర్శలతో ఆగకుండా ఆమె వ్యక్తిత్వాన్ని హననం చేసేలా AI (Artificial Intelligence) ఉపయోగించి సృష్టించిన అసభ్యకరమైన వీడియోలు, మార్ఫింగ్ ఫోటోలను వైరల్ చేశారు. లైంగిక, క్రిమినల్ బెదిరింపులతో సహా ఆమె జీవనోపాధిని, ప్రజా జీవితంలో భద్రతను దెబ్బతీసేలా ప్రవర్తించడం వంటి విషయాలను ఆమె కేసులో ప్రస్తావించారు. అనసూయ ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) లోని కఠినమైన సెక్షన్లతో పాటు ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. BNS సెక్షన్లు: 75, 79, 336(4), 351, 356, IT చట్టం: 66-E, 67 సెక్షన్ల కింద ఎఫ్.ఐ.ఆర్ (FIR) నమోదైంది. ఈ వివాదంపై సింగర్ చిన్మయి శ్రీపాద ఎక్స్ (X) వేదికగా స్పందించారు. ఈ వేధింపులకు పాల్పడిన వారిలో రాజకీయ నాయకులు కూడా ఉన్నారని ఆమె ఆరోపించారు, ముఖ్యంగా కాంగ్రెస్ నాయకురాలు బొజ్జ సంధ్యా రెడ్డి, పలువురు న్యూస్ యాంకర్లు అనసూయను కించపరిచేలా వ్యవహరించారని మండిపడ్డారు. మహిళా రక్షణపై చిత్తశుద్ధి ఉంటే సంధ్యా రెడ్డి లాంటి వారిని పార్టీలో ఉంచుకోవద్దని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరారు.
READ ALSO: Naga Vamsi: ఈగోను సాటిస్ఫై చేసిన సినిమా ఇది: నాగవంశీ
తాజావార్తలు
-
Army Chief: ‘‘భూమిపై ఉంటారా.? చరిత్రలో కలుస్తారా.?’’ పాకిస్తాన్‌కు ఆర్మీ చీఫ్ వార్నింగ్..
-
Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
-
AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్‌తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..