Anaganaga Oka Raju : ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న.. ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju

Anaganaga Oka Raju

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ‘అనగనగా ఒక రాజు’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. సంక్రాంతి రేసులో ‘ది రాజా సాబ్’ వంటి పెద్ద సినిమాలతో పోటీ పడి మరీ, నవీన్ తన కామెడీ టైమింగ్‌తో రూ. 50 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టారు. దర్శకుడు మారి తెరకెక్కించిన ఈ చిత్రం పక్కా రూరల్ కామెడీ డ్రామాగా.. ఒక గ్రామీణ పెళ్లి, ఆ పెళ్లి చుట్టూ తిరిగే పంతాలు, పట్టింపుల మధ్య హీరో చేసే కామెడీ హంగామా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది. ముఖ్యంగా రావు రమేష్, నవీన్ పొలిశెట్టిల మధ్య వచ్చే సన్నివేశాలు ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం కూడా ప్లస్ అయ్యింది. అయితే..

Also Read : KA 2 : ‘క-2’లో కిరణ్ అబ్బవరం ఉండడా? హీరో మార్పుపై నిర్మాత సంచలన వ్యాఖ్యలు!

థియేటర్లలో విజయవంతంగా రన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ఇప్పుడు ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ కానుంది. తాజా సమాచారం ప్రకారం, ఫిబ్రవరి 11, 2026 (కొన్ని చోట్ల ఫిబ్రవరి 13 అని కూడా వార్తలు వస్తున్నాయి) నుండి ఈ సినిమా అందుబాటులోకి రానుంది. కానీ నెట్‌ఫ్లిక్స్ ‘కమింగ్ సూన్’ సెక్షన్‌లో ఇప్పటికే ఈ తేదీని లాక్ చేశారు. థియేటర్లలో మిస్ అయిన వారు లేదా నవీన్ మార్కు కామెడీని మళ్ళీ ఎంజాయ్ చేయాలనుకునే వారు వచ్చే బుధవారం (ఫిబ్రవరి 11) నుండి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వినోదాన్ని వీక్షించవచ్చు.