Congress: బీజేపీకి వచ్చిన ఎలక్టోరల్ బాండ్స్ పై విచారణ జరిపించాలని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యరాలు సోనియా గాంధీ డిమాండ్ చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బయటపడ్డ సమాచారంపై విచారణ జరగాల్సిందే అని అన్నారు. ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా బీజేపీకి 56 శాతం నిధులు వస్తే.. కాంగ్రెస్‌కు 11 శాతం ఫండ్స్ మాత్రమే వచ్చాయని తెలిపారు. బీజేపీకి వేల కోట్ల రుపాయాల ఎలక్టోరల్ బాండ్లు ఎలా వచ్చాయని ఆమె క్వశ్చన్ చేశారు. అక్రమంగా కాంగ్రెస్ బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేశారు.. కేంద్ర ప్రభుత్వ తీరును సోనియా గాంధీ తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్‌ను ఆర్థికంగా దెబ్బ తీసేందుకు మోడీ సర్కార్ కుట్ర చేస్తుందని సోనియా గాంధీ అన్నారు.
Read Also: Kishan Reddy: ఎన్డీయే కూటమికి 400 సీట్లు దాటాలనే లక్ష్యంతో పని చేస్తున్నాం..
ఇక, కాంగ్రెస్ బ్యాంక్ ఖాతాలను ఎలా ఫ్రీజ్ చేస్తారని బీజేపీపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. ఫండ్స్‌ని కట్టడి చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు.. ఎన్నికల ముందు కాంగ్రెస్‌ను ఆర్థింగా దెబ్బ తీయాలని చూస్తున్నారు.. సీతారామ్ కేసరి కాలం నాటి అంశాలపై ఇప్పడు నోటీసులు ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు. చిన్న చిన్న లోపాలను అడ్డు పెట్టుకుని తీవ్ర చర్యలు చేపడుతున్నారని ఖర్గే మండిపడ్డారు. ఇలాంటి చర్యలు కొనసాగితే దేశంలో ప్రజాస్వామ్యం బతకడం కష్టమని ఆయన అన్నారు. నెల రోజులకు పైగా తమ అకౌంట్లను ఫ్రీజ్ చేశారు.. దీంతో మా ఖాతాల్లోని 285 కోట్ల రూపాయలను వాడుకోలేకపోతున్నాం.. ఏ పార్టీకి లేని నిబంధనలన్నీ కాంగ్రెస్ కే వర్తిస్తాయా? అంటూ ప్రశ్నించారు. సరిగ్గా ఎన్నికల సమయంలో మా పార్టీ బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేయడం దారుణం.. నిధులు వాడుకోలేకపోతే మేం ఎన్నికలను ఎలా ఎదుర్కొంటాం అని మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు.