NTV Telugu Site icon

Heart Attack: మూడో తరగతి చిన్నారికి గుండెపోటు.. ఆస్పత్రికి తరలించే లోపే…

Heart Attack

Heart Attack

ఇదివరకు కాలంలో గుండెపోటు కేసులు పెద్దవారిలో మాత్రమే కనిపించేవి. కానీ నేటి ఆధునిక జీవితంలో ఇది చిన్న పిల్లలను కూడా ప్రభావితం చేస్తోంది. తాజాగా గుండెపోటుతో మూడో తరగతి విద్యార్థి మృతి చెందిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. ఈ ఘటన అందరినీ ఆశ్చర్య పరిచింది. తేజస్విని (8) అనే విద్యార్థిని చామరాజనగరలోని సెయింట్ ఫ్రాన్సిస్‌ పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది. సోమవారం ఉత్సాహంగా పాఠశాలకు హాజరైంది. స్నేహితులతో మాట్లాడుతుండగా అస్వస్థతతకు గురైంది. గమనించిన టీచర్లు వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. హార్ట్ ఎటాక్ తోనే చిన్నారి మరణించినట్లు వైద్యులు తేల్చారు. ఈ ఘటనపై కుటుంబీకులు మాట్లాడుతూ… తేజస్వినికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

READ MORE: Venkatesh: పెళ్ళాలకి మీ ఫ్లాష్ బ్యాకులు చెప్పొద్దు

కాగా.. ప్రస్తుతం గుండెజబ్బుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఒకప్పుడు 50-60 ఏళ్ల వయసులో వచ్చే హార్ట్ ఎటాక్ ఇప్పుడు అన్ని వయసుల వారిలోనూ కనిపిస్తోంది. యువత జీవనశైలిలో బాగా మార్పు వచ్చింది. చిన్నవయసులోనే అధిక ఒత్తిడితోపాటు బీపీ, షుగర్ వంటివి వస్తున్నాయి. అందుకే ఛాతినొప్పి, ఊపిరి ఆడకపోవడం, వికారం, మూర్ఛలా అనిపించడం, చెమటలు పట్టడం, అలసట, చేయి, మెడ, వీపు, దవడ, భుజాల భాగాల్లో నొప్పి ఉంటుంది. నడిచినా, మెట్లెక్కినా ఆయాసంగా ఉంటుంది. గుండెలో నొప్పి, పట్టేసినట్టుగా ఉంటుంది. ఈ లక్షణాల్లో ఏవి కనిపించినా తక్షణమే వైద్యుడిని సంప్రదించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలా వైద్యున్ని సంప్రదించి తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

READ MORE:Justin Trudeau: కెనడా ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నా.. ప్రకటించిన జస్టిన్ ట్రూడో..

Show comments