Site icon NTV Telugu

Cheating: ట్రైన్ లో పరిచయం ప్రేమగా మారి.. పెళ్లి చేసుకుంది.. ఇప్పుడు 11 నెలల బిడ్డతో పోలీస్ స్టేషన్ కు

Bihar

Bihar

ప్రయాణాల్లో ఒక్కోసారి అనుకోకుండా జరిగే పరిచయాలు ప్రేమకు దారితీస్తాయి. ఇలాగే ఓ యువతి ట్రైన్ జర్నీ చేస్తున్న సమయంలో ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ప్రేమగా మారి పెళ్లి చేసుకుంది. వారి ప్రేమకు ప్రతిరూపంగా ఓ బిడ్డకు తల్లైంది. కానీ ఇప్పుడు తన 11 నెలల బిడ్డతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. ఇంతకీ ఏం జరిగిందంటే? ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ జిల్లాకు చెందిన రాధ అనే మహిళ ఇప్పుడు తన 11 నెలల బిడ్డతో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతోంది. పానపూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఉభవన్ సారంగ్‌పూర్ గ్రామానికి చెందిన తుంటున్ సాహ్ని తనను మోసం చేశాడని రాధ ఆరోపించింది.

Also Read:Gas Cylinder Code: గ్యాస్ సిలిండర్‌పై ఉండే కోడ్ అర్థం మీకు తెలుసా?

రెండేళ్ల క్రితం తాను పని కోసం రైలులో లూధియానాకు వెళ్తున్నానని బాధితురాలు చెప్పింది. టుంటున్ సాహ్ని కూడా అదే రైలులో ప్రయాణిస్తున్నాడు. ఆ సమయంలో మా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడిందని తెలిపింది. టుంటన్ ఫోన్ కాల్స్ చేసేవాడని.. ఆ తర్వాత క్రమంగా దగ్గరయ్యామని తెలిపింది. టుంటున్ వివాహాన్ని ప్రతిపాదించాడని తెలిపింది.. ఆ తర్వాత రాధ బావమరిది, ఇతర బంధువుల మధ్యవర్తిత్వంతో ఇద్దరూ చండీగఢ్‌లో వివాహం చేసుకున్నారు.

Also Read:Shikhar Dhawan: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌కు ఈడీ సమన్లు.. నేడు విచారణ

వివాహం తర్వాత కొంతకాలం అంతా బాగానే ఉంది. ఆ తర్వాత అసలు కథ మొదలైంది.. రాధను దూరం పెడుతూ చివరకు రాధను చండీగఢ్‌లో వదిలి గ్రామానికి తిరిగి వచ్చాడు. భర్త తనను మోసం చేశాడని గ్రహించిన రాధ పోలీసుల సాయంతో భర్త ఇంటికి చేరుకుంది. కొంతకాలం అత్తింట్లోనే ఉంది. ఈ సమయంలో ఆమె భర్త డబ్బు సంపాదన కోసం ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. అత్త కూడా వేధించడం ప్రారంభించింది. విసిగిపోయిన బాధితురాలు రాధ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Exit mobile version