Cheating: ట్రైన్ లో పరిచయం ప్రేమగా మారి.. పెళ్లి చేసుకుంది.. ఇప్పుడు 11 నెలల బిడ్డతో పోలీస్ స్టేషన్ కు
- ట్రైన్ లో పరిచయం ప్రేమగా మారి
- పెళ్లి చేసుకుంది
- ఇప్పుడు 11 నెలల బిడ్డతో పోలీస్ స్టేషన్ కు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రయాణాల్లో ఒక్కోసారి అనుకోకుండా జరిగే పరిచయాలు ప్రేమకు దారితీస్తాయి. ఇలాగే ఓ యువతి ట్రైన్ జర్నీ చేస్తున్న సమయంలో ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ప్రేమగా మారి పెళ్లి చేసుకుంది. వారి ప్రేమకు ప్రతిరూపంగా ఓ బిడ్డకు తల్లైంది. కానీ ఇప్పుడు తన 11 నెలల బిడ్డతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. ఇంతకీ ఏం జరిగిందంటే? ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ జిల్లాకు చెందిన రాధ అనే మహిళ ఇప్పుడు తన 11 నెలల బిడ్డతో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతోంది. పానపూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఉభవన్ సారంగ్పూర్ గ్రామానికి చెందిన తుంటున్ సాహ్ని తనను మోసం చేశాడని రాధ ఆరోపించింది.
Also Read:Gas Cylinder Code: గ్యాస్ సిలిండర్‌పై ఉండే కోడ్ అర్థం మీకు తెలుసా?
Also Read
- Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
- Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
రెండేళ్ల క్రితం తాను పని కోసం రైలులో లూధియానాకు వెళ్తున్నానని బాధితురాలు చెప్పింది. టుంటున్ సాహ్ని కూడా అదే రైలులో ప్రయాణిస్తున్నాడు. ఆ సమయంలో మా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడిందని తెలిపింది. టుంటన్ ఫోన్ కాల్స్ చేసేవాడని.. ఆ తర్వాత క్రమంగా దగ్గరయ్యామని తెలిపింది. టుంటున్ వివాహాన్ని ప్రతిపాదించాడని తెలిపింది.. ఆ తర్వాత రాధ బావమరిది, ఇతర బంధువుల మధ్యవర్తిత్వంతో ఇద్దరూ చండీగఢ్‌లో వివాహం చేసుకున్నారు.
వివాహం తర్వాత కొంతకాలం అంతా బాగానే ఉంది. ఆ తర్వాత అసలు కథ మొదలైంది.. రాధను దూరం పెడుతూ చివరకు రాధను చండీగఢ్‌లో వదిలి గ్రామానికి తిరిగి వచ్చాడు. భర్త తనను మోసం చేశాడని గ్రహించిన రాధ పోలీసుల సాయంతో భర్త ఇంటికి చేరుకుంది. కొంతకాలం అత్తింట్లోనే ఉంది. ఈ సమయంలో ఆమె భర్త డబ్బు సంపాదన కోసం ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. అత్త కూడా వేధించడం ప్రారంభించింది. విసిగిపోయిన బాధితురాలు రాధ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
-
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
-
Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..