Site icon NTV Telugu

Amit Shah: సీఏఏపై మమతకు వచ్చిన ఇబ్బందేంటి?

Ake

Ake

దేశ వ్యాప్తంగా సెకండ్ విడత పోలింగ్‌కు సమయం దగ్గర పడింది. సెకండ్ ఫేజ్‌లో జరిగే స్థానాల్లో బుధవారం ప్రచారం ముగియనుంది. దీంతో నేతలు స్పీడ్ పెంచారు. విమర్శల దాడి కూడా హీటెక్కిస్తున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్‌లో మమత బెనర్జీ ప్రభుత్వంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఇది కూడా చదవండి: PM Modi: ముస్లింలపై విద్వేష వ్యాఖ్యలు.. మోడీపై చర్యలు తీసుకోవాలని ఈసీకి 17,000 మంది లేఖ..

కాంగ్రెస్‌కు కానీ, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కానీ.. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టంలో జోక్యం చేసుకునే ధైర్యం లేదని అమిత్‌ షా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందువులు, బౌద్ధులకు భారత్‌లో పౌరసత్వం ఇస్తే.. మీకు వచ్చిన సమస్య ఏంటని నిలదీశారు. తమ రాష్ట్రంలోకి చొరబాటుదారులు ప్రవేశించకుండా అడ్డుకోవాలని బెంగాల్ ప్రజలు కోరుకుంటే.. సందేశ్‌ఖాలీ తరహా ఘటనలు చోటుచేసుకోకుండా ఉండాలంటే.. మోడీ మళ్లీ ప్రధానిగా కావాలని పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండి: Lok sabha election: 4 రాష్ట్రాలకు హీట్ వేవ్ ఎఫెక్ట్.. 26న పోలింగ్ తగ్గనుందా?

గత ఎన్నికల్లో 18 సీట్లు ఇచ్చారని.. ప్రతిగా మోడీ రామమందిరం తీసుకువచ్చారని అమిత్ షా గుర్తుచేశారు. ఈసారి 35 సీట్లు ఇస్తే.. చొరబాట్లను ఆపేస్తారన్నారు. తన ఓటు బ్యాంక్‌పై దృష్టిపెట్టిన మమతాబెనర్జీ.. సందేశ్‌ఖాలీలో మహిళల్ని వేధించినా పట్టించుకోలేదని విమర్శించారు. కానీ హైకోర్టు జోక్యంతో ఇప్పుడు నిందితుడు జైల్లో ఉన్నాడన్నారు. ఈసారి తమ లక్ష్యం 35 లోక్‌సభ స్థానాలు సాధించడమని వెల్లడించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం రూ.7 లక్షల కోట్లను రాష్ట్రానికి ఇచ్చిందని తెలిపారు. కానీ తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ నేతలు మాత్రం అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. పదేళ్ల క్రితం వరకు టీఎంసీ నేతలు చిన్నపాటి ఇళ్లల్లో ఉండేవారని.. సైకిల్‌ మీద తిరిగేవారన్నారు. కానీ ఇప్పుడు నాలుగు అంతస్తుల భవనాల్లో నివసిస్తూ.. కార్లలో చక్కర్లు కొడుతున్నారని తెలిపారు. అందంతా ప్రజల సొమ్మేనంటూ అమిత్ షా విమర్శలు చేశారు.

 

ఇది కూడా చదవండి: Rahul gandhi: అమేథీలో రాహుల్ ఇల్లు క్లీనింగ్.. ఏం జరుగుతోంది!

Exit mobile version