భారతదేశాన్ని అభివృద్ధి చేయడంలో ప్రధాని మోడీ ఏ అవకాశాన్ని వదిలిపెట్టలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశాన్ని సురక్షితంగా ఉంచే పని ప్రధాని మోడీ చేశారన్నారు. గాంధీనగర్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. 2014 కి ముందు, ప్రతిరోజూ ఉగ్రవాద దాడులు జరిగాయని.. కానీ అప్పటి ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదని విమర్శించారు. కానీ ఇప్పుడు అలా కాదని శత్రు దేశానికి తగిన సమాధానం చెబుతామన్నారు. సైన్యం ఇటుకలకు రాళ్లతో ప్రతిస్పందించిందని అన్నారు. సైన్యం కారణంగా తాము గర్వంగా తలలు పైకెత్తామన్నారు. అణు ముప్పుకు తాము భయపడటం లేదని మరోసారి వ్యాఖ్యానించారు.
READ MORE: Eatala Rajendar: ఉగ్ర కుట్రలకు ప్రతిఫలం ఏంటో పాకిస్తాన్ చూసింది..
ఆపరేషన్ సిందూర్ గురించి అమిత్ షా మరోసారి మాట్లాడారు. భారత వైమానికి దళం పాకిస్థాన్ లోకి 100 కిలోమీటర్లు ప్రవేశించి దాడులు చేసిన విధానాన్ని గుర్తు చేశారు. ” మేము అణ్వాయుధ బెదిరింపులకు భయపడము. బార్డర్ నుంచి100 కిలోమీటర్ల లోపల దాడులు చేశాం. పాకిస్థాన్ వైమానిక స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. మన వాయు రక్షణ వ్యవస్థ చాలా బలంగా ఉంది. దీన్ని చూసి ప్రస్తుతం పాకిస్థాన్ భయపడుతోంది. 2014 కి ముందు ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచి వచ్చేవారు. వాళ్ళు మన వాళ్ళని చంపి వెళ్ళిపోయేవారు. కానీ గత ప్రభుత్వం ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఉగ్రవాదులు మూడు పెద్ద దాడులకు పాల్పడ్డారు. ఇటీవల పాకిస్థాన్ స్పాన్సర్ చేసిన ఉగ్రవాదులు పహల్గామ్‌పై దాడి చేశారు. కానీ ప్రతి దాడిపై ప్రధాని మోడీ స్పందించారు. ఈ రోజు ప్రపంచం మొత్తం ఆశ్చర్యంగా చూస్తుంది. పాకిస్థాన్ మాత్రం భయంతో వణుకుతోంది.” అని అమిత్ షా వ్యాఖ్యానించారు.
READ MORE: Bhairavam: వారికి గ్యాప్ వచ్చింది.. ముగ్గురు హీరోలను హ్యాండిల్ చేయడం కష్టమని అనుకున్నా!
