NTV Telugu Site icon

Amit Shah: లాలూ, నితీష్ కుమార్‌పై తీవ్ర విమర్శలు.. దర్భంగా ఎయిమ్స్ పనులపై ఫైర్

Amit Sha

Amit Sha

కేంద్రమంత్రి అమిత్ షా శనివారం బీహార్‌లో పర్యటించారు. ఝంజర్‌పూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. సీఎం నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్‌లపై విరుచుకుపడ్డారు. బీహార్‌ దుస్థితికి నితీష్‌ కుమార్‌, లాలూ ప్రసాద్‌ బాధ్యులని విమర్శించారు. అంతేకాకుండా.. మోడీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల గురించి తెలిపారు.

బీహార్లో “రక్షాబంధన్, జన్మాష్టమికి సెలవులు ఉండవని ఇటీవల నితీష్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. దర్భంగా ఎయిమ్స్ గురించి మాట్లాడారు. మోడీ ప్రభుత్వం దర్భంగాలో ఎయిమ్స్‌ను రూ.1250కి ప్రతిపాదించిందని తెలిపారు. దీని కోసం నితీశ్ ప్రభుత్వం మెడికల్ కాలేజీకి 81 ఎకరాల భూమిని ఇచ్చి.. వెనక్కి తీసుకుందని పేర్కొన్నారు. ఆ తర్వాత గుంతలు ఉన్న స్థలం ఎయిమ్స్ నిర్మాణానికి ఇచ్చారని చెప్పారు. దీంతో సరిగా లేక ఎయిమ్స్‌ నిర్మాణం జరగలేదు. బీహార్ ప్రభుత్వం ఆ భూమిని వెనక్కి తీసుకోకుంటే దర్భంగాలో ఇప్పటికి ఎయిమ్స్‌ నిర్మాణం పూర్తై రోగులకు వైద్య సేవలు అందేవని చెప్పారు.

Minister Harish Rao: ఆ పార్టీ వాళ్ళు తిట్లలో పోటీ.. మనది కిట్లలో పోటీ

బీహార్‌లో పర్యాటక రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను అమిత్ షా వివరించారు. రామాయణ సర్క్యూట్‌లో సీతామర్హి, బక్స్, దర్భంగాలను చేర్చి.. మోడీ ప్రభుత్వం పర్యాటకాన్ని జోడించిందన్నారు. మిథిలా మఖానాకు జీఐ ట్యాగ్ ఇచ్చే పని బీజేపీ ప్రభుత్వం చేసిందని తెలిపారు. అంతేకాకుండా.. రూ.125 కోట్లతో దర్భంగా, సక్రి, జయనగర్‌, సమస్తిపూర్‌ రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి పనులు చేపడుతోందని అన్నారు.

Baramulla Encounter: ముగ్గురు ఉగ్రవాదులు హతమార్చిన సైన్యం.. పాక్ వైపు నుంచి కాల్పులు..

మరోవైపు అటల్‌జీ ప్రారంభించిన కోసి మహాసేతును యూపీఏ ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిందని.. దానిని పూర్తి చేసే పని మోడీ ప్రభుత్వం చేసిందని అమిత్ షా అన్నారు. యూపీఏ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉందని.. ఈ సమయంలో బీహార్‌కు ఏం ఇచ్చారని లాలూని ప్రశ్నించారు. అంతేకాకుండా.. రూ.1200 కోట్లతో పాట్నా ఎయిర్‌పోర్టు పునరాభివృద్ధి గురించి తన ప్రసంగంలో ప్రస్తావించారు.