Aadhi Pinisetty: ‘శబ్దం’ డిఫరెంట్ స్క్రీన్ ప్లే వున్న హారర్ ఫిల్మ్: హీరో ఆది పినిశెట్టి ఇంటర్వ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘వైశాలి’తో సూపర్‌హిట్‌ని అందించిన హీరో ఆది పినిశెట్టి, దర్శకుడు అరివళగన్‌లు రెండోసారి మరో ఇంట్రస్టింగ్ సూపర్‌నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ ‘శబ్దం’ కోసం చేతులు కలిపారు. 7G ఫిల్మ్స్ శివ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సిమ్రాన్, లైలా, లక్ష్మీ మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ తో సినిమాపై క్యూరియాసిటీ పెంచాయి. ఈ సినిమా ఫిబ్రవరి 28న ఆంధ్రాలో ఎన్ సినిమాస్, నైజాంలో మైత్రి డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో ఆది పినిశెట్టి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
‘శబ్దం’ హారర్ సినిమాల్లో ఎంత డిఫరెంట్ గా ఉంటుంది?
– శబ్దం మంచి కథా బలం ఎమోషన్ వున్న హారర్ జోనర్ సినిమా. రెగ్యులర్ హారర్ సినిమాలకి చాలా భిన్నంగా ఉంటుంది. ఆత్మలని ఒక సైంటిఫిక్ మెథడ్ లో అన్వేషించే విధానం చాలా కొత్త అనుభూతిని ఇస్తుంది. స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి సినిమాలు తీయడం కూడా కష్టమే. ఇలాంటి వరల్డ్ ని ఇంతకు ముందు ఎవరూ చూపించలేదు. హారర్ సినిమాల్లో ‘వైశాలి’ ఎంత డిఫరెంట్ సినిమానో శబ్దం కూడా అంత డిఫరెంట్ గా స్పెషల్ గా ఉంటుంది. టెక్నికల్ గా సినిమా చాలా రిచ్ గా ఉంటుంది.
Also Read
- Nandini Reddy: "నా పక్కన లేనిది మొగుడు ఒక్కడే.! మిగతావన్నీ ఉన్నాయి.." పెళ్లి, ఒంటరితనంపై ఓపెన్ అయిన లేడి డైరెక్టర్.!
- Nandini Reddy: "అన్నం పెట్టే చెయ్యిని నరుకుతారా..?" రెమ్యునరేషన్లు పెంచే దర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్!
- Jailer 2 Release: హుకుం.. రజనీకాంత్ ఫ్యాన్స్‌కు పండుగ.. ‘జైలర్ 2’ రిలీజ్ డేట్ కన్ఫామ్.!
- Dhruv Vikram: మైత్రీ మూవీ మేకర్స్ 4వ తమిళ సినిమాలో హీరోగా ధృవ్ విక్రమ్
శబ్దంలో సౌండ్ రోల్ ఏమిటి ?
-ఇందులో నాది పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ క్యారెక్టర్. తను ఆత్మలని సౌండ్ తోనే పసి గడుతుంటాడు. సౌండ్ అనేది ప్రతి సీన్ లో ఇంపార్టెన్స్ ఉంటుంది. నిజానికి నేను ఆత్మలని నమ్మను. కానీ ఈ సినిమా కోసం మెటీరియల్ చదువుతున్నపుడు నిజంగా అలాంటి అదృశ్య శక్తులు ఉంటాయోమో అనిపించింది.
డైరెక్టర్ అరివళగన్ గురించి ?
-మా డైరెక్టర్ అరివళగన్ కి థాంక్ యూ చెప్పాలి. వైశాలి ఇప్పుడు చూసినా రిలవెంట్ గా ఉంటుంది. కథలో వున్న నిజాయితీ అది. అదే నిజాయితీతో శబ్దం తీశాం. వైశాలి సినిమా కూడా హారర్. అది నా కెరీర్ స్పెషల్ మూవీ. అలాగే శబ్దం సినిమా కూడా స్పెషల్ మూవీ. మేము ఎప్పటినుంచో సినిమా చేయాలని అనుకున్నాం. వైశాలి లాంటి కొత్త కథ కాన్సెప్ట్ కుదరాలి. అలాంటి కథ శబ్ధంతో కుదిరింది. సినిమా థియేటర్స్ లో చూడాలని ఆసక్తి కలిగించేలా ఉంటుంది. చాలా మంచి ఎక్స్ పీరియన్సు ఇస్తుంది.
సిమ్రన్, లైలా పాత్రల గురించి ?
-సిమ్రన్, లైలా గారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. వారి పాత్రలు సినిమాలో చాలా కీలకంగా వుంటాయి. క్యారెక్టర్స్ చాలా ఫ్రెష్ గా అనిపిస్తాయి.
హారర్ సినిమాలు మీకు ఇష్టమా ?
మంచి కథా బలం స్క్రీన్ ప్లే వున్న హారర్ సినిమాలని ఇష్టపడతాను. ఈ జోనర్ లో సినిమాలు చేయడానికి ఇష్టపడతాను.
తమన్ మ్యూజిక్ గురించి ?
-ఇలాంటి సినిమాలకి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. తమన్ గారి మ్యూజిక్ మాకు చాలా ప్లస్ అయ్యింది. ఆయన పెద్ద సినిమాలు చేస్తూ కూడా మా సినిమాకి మ్యూజిక్ చేశారు. సినిమాకి ఎంతకావాలో అంతకంటే అద్భుతంగా చేశారు. సినిమా చూస్తున్నపుడు మ్యూజిక్ ని చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాకి టెక్నికల్ టీం అద్భుతంగా పని చేసింది. సౌండ్ డిజైన్ చాలా అద్భుతంగా వుంది. కెమరామెన్ అరుణ్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. ఆర్ట్ వర్క్ కూడా మెస్మరైజింగా అనిపిస్తుంది. ప్రతి క్రాఫ్ట్ చాలా ప్రేమతో సినిమా చేశారు.
ప్రస్తుతం చేస్తున్న సినిమాలు గురించి? ;
-అఖండ 2లో ఓ క్యారెక్టర్ చేస్తున్నాను. దేవాకట్టా గారి దర్శకత్వంలో మయసభ చేస్తున్నాను. అలాగే ‘డ్రైవ్’ అనే సినిమా చేస్తున్నాను. మరకతమణి 2 షూటింగ్ జరుగుతోంది.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్‌ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్‌లో డిస్‌ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో TWS ఇయర్‌బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!