తమిళనాడులోని కోయంబత్తూరులో ఈషా ఫౌండేషన్ నిర్వహించిన మహాశివరాత్రి ఉత్సవాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోని పురాతన భాష అయిన తమిళంలో తాను మాట్లాడలేకపోవడం బాధగా ఉందన్నారు. అక్కడికి వచ్చిన భక్తులకు క్షమాపణలు కోరారు.