NTV Telugu Site icon

China Virus: చైనాలో కొత్త వైరస్.. అమెరికా అప్రమత్తం.. రాకపోకలు నిషేదం..

China

China

చైనాలో మరో వైరల్ వేగంగా వ్యాపిస్తోంది. దీని కారణంగా చాలా దేశాలు ఆందోళన చెందుతున్నాయి. మరోవైపు అమెరికా, చైనాల మధ్య ప్రయాణ నిషేధం విధించాలని అమెరికా సెనేటర్లు అధ్యక్షుడు జో బైడెన్‌ను డిమాండ్ చేశారు. మార్కో రూబియో నేతృత్వంలోని ఐదుగురు రిపబ్లికన్ సెనేటర్లు నిన్న యూఎస్ ప్రెసిడెంట్ కు లేఖ రాశారు.

Read Also: Heart Attack: గుజరాత్‌కు గుండెపోటు..! 6 నెలల్లో 1,052 మంది మృతి

ఇక, మార్కో రూబియో నేతృత్వంలోని రిపబ్లికన్ సెనేటర్ల బృందం అధ్యక్షుడు బిడెన్‌కు రాసిన లేఖలో ఆసియా దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతున్న శ్వాసకోశ వ్యాధి (చైనా న్యుమోనియా) గురించి మరింత సమాచారం వచ్చే వరకు యూఎస్- చైనా మధ్య రాకపోకలు నిషేధించాలని పేర్కొన్నారు. ఈ కొత్త వ్యాధి వల్ల కలిగే నష్టాల గురించి మరింత సమాచారం తెలుసుకునే వరకు ఆంక్షలు విధించాలని కోరారు. అయితే, గత వారం ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అభివృద్ధి చెందుతున్న వ్యాధిపై చైనా నుండి వివరణాత్మక నివేదికను కోరినప్పుడు కేసుల పెరుగుదల ప్రపంచ సమస్యగా మారింది అని తెలిపింది.

అమెరికాలో పెరుగుతున్న ఆందోళన:

అయితే, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ (CCP) ప్రజారోగ్య సంక్షోభాల గురించి అబద్ధాలు చెబుతుందని యూఎస్ సెనేటర్లు ఆరోపించారు. కరోనా సమయంలో చైనా అబద్దాలు చెప్పడం వల్లే ప్రపంచం మొత్తం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవల్సి వచ్చిందని వారు పేర్కొన్నారు. కోవిడ్-19 మహమ్మారికి ప్రతిస్పందించడంలో చైనా అధికారుల సహకారం లేకపోవడం గురించి WHO పదేపదే ఆందోళనలు చేసింది అని సెనేటర్లు అన్నారు.

Read Also: Salaar Trailer: సార్… ట్రైలర్ లో లాగా సినిమాలో కూడా ప్రభాస్ మధ్యలో రాడు కదా?

అమెరికన్ల ఆరోగ్యాన్ని రక్షించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి అని సెనేటర్లు అధ్యక్షుడు జో బైడెన్‌ను డిమాండ్ చేశారు. చైనా ఈ కొత్త వ్యాధి ప్రమాదాల గురించి మరింత సమాచారం పొందే వరకు అమెరికా- చైనా మధ్య రాకపోకల్ని నిలిపివేసేలా తగిన చర్యలు తీసుకోవాలి.. దీని వల్ల వ్యాధి వ్యాప్తిని నివారించే అవకాశం ఉంది.. యూఎస్ లో మరణాలు, లాక్‌డౌన్ లాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సిన అవసరం లేదు అని వెల్లడించారు.

Read Also: Krishna Water Issue: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంచాయతీ.. నేడు సీడబ్ల్యూసీ సమావేశం

అయితే, చైనాలో వ్యాప్తి చెందుతున్న వైరల్ ని యునైటెడ్ స్టేట్స్ నిశితంగా పరిశీలించింది. అయితే ఇది కాలానుగుణ వ్యాధిగా కనిపిస్తోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పరిపాలన అధికారి తెలిపారు. చైనా నుంచి వచ్చి యూఎస్ అత్యవసర విభాగాలలో చేరిన వ్యక్తులు శ్వాసకోశ వ్యాధి ఉన్నవారిలో ఎలాంటి పెరుగుదల ఉన్నట్లు లేదు అని పేర్కొన్నారు.