NTV Telugu Site icon

Ameesha Patel : త‌న‌కంటే 20 ఏళ్లు చిన్నోడితో స్టార్ హీరోయిన్ ఎఫైర్?

New Project (6)

New Project (6)

Ameesha Patel : బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ అమీషాపటేల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఆమె తెలుగు వారికి కూడా సుపరిచితురాలే. ప‌వన్ క‌ల్యాణ్ స‌ర‌స‌న బ‌ద్రి చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత మహేశ్ బాబు నాని, ఎన్టీఆర్ తో నరసింహుడు చిత్రాల్లో నటించింది. బద్రి సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఆమె ఆరంగేట్ర‌మే బ్లాక్ బ‌స్టర్ అందుకుంది. బాలీవుడ్ లో హృతిక్ స‌ర‌స‌న `కహోనా ప్యార్ హై` చిత్రంతో ప్రేక్షకులకు దగ్గరైంది. 2000లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ సాధించింది. ఇటీవల హిందీ చిత్రసీమ‌లో గదర్: ఏక్ ప్రేమ్ కథ, జమీర్: ది ఫైర్ వితిన్, యే హై జల్వా వంటి అనేక బ్లాక్‌బస్టర్‌లలో నటించింది. అయితే, అమీషా తన చిత్రాలతో పాటు ఎఫైర్ ల‌తోను నిరంత‌రం వార్తల్లో నిలుస్తోంది.

49ఏళ్ల లేటు వయసులో ప్రముఖ పారిశ్రామిక‌వేత్త నిర్వాన్ బిర్లాతో రొమాన్స్ చేస్తోందంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. నిర్వాన్ బిర్లా పారిశ్రామికవేత్తలు యశోవర్ధన్ బిర్లా – అవంతి బిర్లాల కుమారుడు. అతడు కూడా పారిశ్రామికవేత్త.. గాయకుడు కూడా.. ఆస‌క్తిక‌రంగా త‌న కంటే 20 ఏళ్ల చిన్నోడితో అమీషా ఇప్పుడు ప్రేమ‌లో ప‌డింద‌ని హిందీ మీడియా క‌థ‌నాలు వెలువ‌రిస్తోంది. నిజానికి ఎఫైర్లు అమీషాకు కొత్తేమీ కాదు. అమీషా కెరీర్ తొలినాళ్లలోనే పెళ్ల‌యిన బిజినెస్ మ్యాగ్నెట్ల‌తో రిలేష‌న్ లో ఉంద‌న్న ప్రచారం జరిగింది. తనకంటే ఎనిమిదేళ్లు పెద్దవాడైన విక్రమ్ భట్ తో అమీషా పటేల్ ఎఫైర్ నడిపించింద‌ని ప్రచారం సాగింది. ఐదేళ్ల పాటు ఆ ఇద్దరి పై పుకార్లు కొన‌సాగాయి. కానీ చివరికి విడిపోవాలని నిర్ణయించుకున్నారు. తరువాత ఒక ఇంటర్వ్యూలో విక్రమ్‌తో డేటింగ్ చేయడం తన జీవితంలో అతిపెద్ద తప్పుల్లో ఒకటి అని ఒప్పుకుంది.

Read Also:Maharashtra: బీజేపీ మాజీ మహిళా ఎంపీపై దాడి.. కుర్చీలు విసురుతూ.. దుర్భాషలాడుతూ(వీడియో)

లండన్‌కు చెందిన వ్యాపారవేత్త కనవ్ పూరితో అమీషా పటేల్ సంబంధం 2008లో ప్రారంభమైనట్లు క‌థ‌నాలొచ్చాయి. అయితే, అమీషా తన కెరీర్‌పై ఎక్కువ దృష్టి పెట్టాలని నిర్ణయించుకోవడంతో రెండేళ్ల తర్వాత ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. తరువాత అమీషా వ్యాపారవేత్త ఐపిఎల్ జట్టు యజమాని అయిన నెస్ వాడియాతో ఎఫైర్ మొద‌లు పెట్టిందంటూ ప్రచారం సాగింది. అత‌డు చిన్నప్పటి నుంచి త‌న‌పై క్రష్ ఉంద‌ని చెప్పాడు. ముంబైలోని వ్యాయామశాలలో ఒకరినొకరు కలుసుకున్నప్పుడు ప్రేమ చిగురించింది. నెస్ అమీషాకు అనేక బహుమతులు కూడా పంపారు. అయితే అమీషా తన కెరీర్‌లో మళ్లీ మొదటి స్థానానికి ఎద‌గాల‌ని భావించ‌డంతో ఈ సంబంధం ముగిసింది. అమీషా పటేల్ నిర్మాత కం వ్యాపార భాగస్వామి కునాల్ గూమర్‌తో కొన్నాళ్ల పాటు సంబంధం కలిగి ఉంద‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అమీషా తన బాయ్‌ఫ్రెండ్, కునాల్ అతని భార్య షామ్లీ ఉన్న ఒకే ఇంట్లో నివసించేదని కొన్ని క‌థ‌నాలొచ్చాయి. అయితే నిర్మాతతో తనకున్న సంబంధంపై అమీషా ఎప్పుడూ స్పందించలేదు.

అమీషా పటేల్ కొత్త బోయ్ ఫ్రెండ్ నిర్వాన్ పటేల్ బిర్లా. వ్యాపారవేత్త నిర్వాన్ బిర్లాతో స‌న్నిహితంగా ఉన్న ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. నిర్వాణ్ చేతుల్లో స‌న్నిహితంగా ఒదిగిపోయి కనిపించింది అమీషా. ఇది సహజంగానే వారి రిలేషన్ గురించిన‌ ఉత్సుకతకు దారితీసింది. ఫోటోలో నిర్వాణ్ ఒడిలో అమీషా కూర్చోవడమే కాకుండా ఇద్దరూ ప్రేమ‌జంట‌లా వామ్ గా క‌నిపించారు. ఈ జంట‌ దుబాయ్‌లో ఉన్నార‌ని క్యాప్షన్ రివీల్ చేసింది. అమీషా క్యాప్షన్‌లో హార్ట్ ఎమోజీలు కూడా ఉన్నాయి. నిర్వాన్ వ్యాఖ్యల‌ విభాగంలో “చాలా సరదాగా! నిన్ను ప్రేమిస్తున్నాను“ అంటూ నీలి హృదయంతో ప్రతిస్పందించారు.

Read Also:Darshi : ప్రియదర్శి ‘సారంగపాణి జాతకం’ టీజర్ డేట్ ఇదే..

Show comments