Darshi : ప్రియదర్శి ‘సారంగపాణి జాతకం’ టీజర్ డేట్ ఇదే..
- ప్రియదర్శి హీరోగా వస్తున్న సారంగపాణి జాతకం
- దర్శకత్వం వహిస్తున్న మోహన కృష్ణ ఇంద్రగంటి
- వినూత్నంగా సారంగపాణి టీజర్ డేట్ ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ‘సారంగపాణి జాతకం’. ఈ చిత్రంలో ప్రియదర్శి సరసన తెలుగమ్మాయి రూప కొడువాయూర్ కథానాయికగా నటించారు. ‘జెంటిల్‌మన్’, ‘సమ్మోహనం’ విజయాల తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి, శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో రూపొందుతున్న మూడో చిత్రమిది. డిసెంబర్ 20వ తేదీన సినిమా విడుదల చేయనున్నారు. నవంబర్ 21, ఉదయం 11:12 కి టీజర్ విడుదల చేయనున్నట్లు ఈ రోజు వెల్లడించారు.
Also Read : AlluArjun : పుష్ప -2 ట్రైలర్ ఏ ఏ భాషల్లో ఎక్కడెక్కడ రిలీజ్ కానుందో తెలుసా..?
Also Read
- Dhanush OM: రజినీ కోసం స్టార్ హీరో ధనుష్ బిగ్ డెసిషన్.. ‘జైలర్ 2’తో పోటీ వద్దంటూ సంచలన ప్రకటన!
- The Paradise: నాని కెరీర్లోనే రికార్డ్ ఓపెనింగ్ దిశగా ‘ది ప్యారడైజ్’.. రిలీజ్‌కు ముందే కోటి దాటేసిన సినిమా!
- Ram Charan: "మన కుటుంబాన్ని మార్చేసిన ఆ రోజును మర్చిపోలేం నాన్న" చిరంజీవిపై రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్..
- Sumalatha: జానీ మాస్టర్ భార్య సుమలతపై దాడి?
శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ”ఈ నెల 21వ తేదీన ఉదయం 11:12 గంటలకు మా ‘సారంగపాణి జాతకం’ టీజర్ విడుదల చేస్తున్నాం. ప్రేక్షకులకు మా సారంగపాణి ప్రపంచం ఎలా ఉంటుందో ఆ రోజున పరిచయం చేస్తాం. సినిమా చిత్రీకరణ సెప్టెంబర్ మొదటి వారంలో పూర్తి చేశాం. డబ్బింగ్ కార్యక్రమాలు సైతం పూర్తి అయ్యాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం రీ రికార్డింగ్ పనులు జరుగుతున్నాయి. మనిషి భవిష్యత్తు చేతి రేఖల్లో ఉంటుందా? లేదా చేసే చేతల్లో ఉంటుందా? అనే ప్రశ్నకు జవాబు ఇచ్చే ఓ పరిపూర్ణ హాస్యరస సినిమా ఇది. ఇంటిల్లిపాది చూసి నవ్వుకునే వినోదాత్మక సినిమా. మోహనకృష్ణ ఇంద్రగంటి చాలా అద్భుతంగా తీశారు. ఈ ఏడాది ఆఖరులో డిసెంబరు లో అందరినీ నవ్విస్తుందీ సినిమా” అని అన్నారు. ప్రియదర్శి పులికొండ, రూప కొడువాయూర్ జంటగా నటించిన ఈ సినిమాలో నరేష్ విజయకృష్ణ, తనికెళ్ళ భరణి, శ్రీనివాస్ అవసరాల, ‘వెన్నెల’ కిశోర్, ‘వైవా’ హర్ష, శివన్నారాయణ వంటి ఎందరో నటీనటులు కీలక పాత్రల్లో నటించారు.
మన సారంగపాణికి ముందున్నవన్నీ మంచి రోజులేనంట, అందుకే…
Bringing you the #SarangapaniJathakam Teaser on Nov 21st, 11:12AM 🖐️🤩
Await a KILLER COMEDY on Dec 20th💥😉#MohanaKrishnaIndraganti @PriyadarshiPN @RoopaKoduvayur #VivekSagar @SrideviMovieOff @adityamusic pic.twitter.com/8tXyz7y50G
— Sridevi Movies (@SrideviMovieOff) November 17, 2024
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!