Ameesha Patel : తనకంటే 20 ఏళ్లు చిన్నోడితో స్టార్ హీరోయిన్ ఎఫైర్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ameesha Patel : బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ అమీషాపటేల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఆమె తెలుగు వారికి కూడా సుపరిచితురాలే. పవన్ కల్యాణ్ సరసన బద్రి చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత మహేశ్ బాబు నాని, ఎన్టీఆర్ తో నరసింహుడు చిత్రాల్లో నటించింది. బద్రి సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఆమె ఆరంగేట్రమే బ్లాక్ బస్టర్ అందుకుంది. బాలీవుడ్ లో హృతిక్ సరసన `కహోనా ప్యార్ హై` చిత్రంతో ప్రేక్షకులకు దగ్గరైంది. 2000లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ సాధించింది. ఇటీవల హిందీ చిత్రసీమలో గదర్: ఏక్ ప్రేమ్ కథ, జమీర్: ది ఫైర్ వితిన్, యే హై జల్వా వంటి అనేక బ్లాక్‌బస్టర్‌లలో నటించింది. అయితే, అమీషా తన చిత్రాలతో పాటు ఎఫైర్ లతోను నిరంతరం వార్తల్లో నిలుస్తోంది.
49ఏళ్ల లేటు వయసులో ప్రముఖ పారిశ్రామికవేత్త నిర్వాన్ బిర్లాతో రొమాన్స్ చేస్తోందంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. నిర్వాన్ బిర్లా పారిశ్రామికవేత్తలు యశోవర్ధన్ బిర్లా – అవంతి బిర్లాల కుమారుడు. అతడు కూడా పారిశ్రామికవేత్త.. గాయకుడు కూడా.. ఆసక్తికరంగా తన కంటే 20 ఏళ్ల చిన్నోడితో అమీషా ఇప్పుడు ప్రేమలో పడిందని హిందీ మీడియా కథనాలు వెలువరిస్తోంది. నిజానికి ఎఫైర్లు అమీషాకు కొత్తేమీ కాదు. అమీషా కెరీర్ తొలినాళ్లలోనే పెళ్లయిన బిజినెస్ మ్యాగ్నెట్లతో రిలేషన్ లో ఉందన్న ప్రచారం జరిగింది. తనకంటే ఎనిమిదేళ్లు పెద్దవాడైన విక్రమ్ భట్ తో అమీషా పటేల్ ఎఫైర్ నడిపించిందని ప్రచారం సాగింది. ఐదేళ్ల పాటు ఆ ఇద్దరి పై పుకార్లు కొనసాగాయి. కానీ చివరికి విడిపోవాలని నిర్ణయించుకున్నారు. తరువాత ఒక ఇంటర్వ్యూలో విక్రమ్‌తో డేటింగ్ చేయడం తన జీవితంలో అతిపెద్ద తప్పుల్లో ఒకటి అని ఒప్పుకుంది.
Also Read
Read Also:Maharashtra: బీజేపీ మాజీ మహిళా ఎంపీపై దాడి.. కుర్చీలు విసురుతూ.. దుర్భాషలాడుతూ(వీడియో)
లండన్‌కు చెందిన వ్యాపారవేత్త కనవ్ పూరితో అమీషా పటేల్ సంబంధం 2008లో ప్రారంభమైనట్లు కథనాలొచ్చాయి. అయితే, అమీషా తన కెరీర్‌పై ఎక్కువ దృష్టి పెట్టాలని నిర్ణయించుకోవడంతో రెండేళ్ల తర్వాత ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. తరువాత అమీషా వ్యాపారవేత్త ఐపిఎల్ జట్టు యజమాని అయిన నెస్ వాడియాతో ఎఫైర్ మొదలు పెట్టిందంటూ ప్రచారం సాగింది. అతడు చిన్నప్పటి నుంచి తనపై క్రష్ ఉందని చెప్పాడు. ముంబైలోని వ్యాయామశాలలో ఒకరినొకరు కలుసుకున్నప్పుడు ప్రేమ చిగురించింది. నెస్ అమీషాకు అనేక బహుమతులు కూడా పంపారు. అయితే అమీషా తన కెరీర్‌లో మళ్లీ మొదటి స్థానానికి ఎదగాలని భావించడంతో ఈ సంబంధం ముగిసింది. అమీషా పటేల్ నిర్మాత కం వ్యాపార భాగస్వామి కునాల్ గూమర్‌తో కొన్నాళ్ల పాటు సంబంధం కలిగి ఉందని ఆరోపణలు వచ్చాయి. అమీషా తన బాయ్‌ఫ్రెండ్, కునాల్ అతని భార్య షామ్లీ ఉన్న ఒకే ఇంట్లో నివసించేదని కొన్ని కథనాలొచ్చాయి. అయితే నిర్మాతతో తనకున్న సంబంధంపై అమీషా ఎప్పుడూ స్పందించలేదు.
అమీషా పటేల్ కొత్త బోయ్ ఫ్రెండ్ నిర్వాన్ పటేల్ బిర్లా. వ్యాపారవేత్త నిర్వాన్ బిర్లాతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. నిర్వాణ్ చేతుల్లో సన్నిహితంగా ఒదిగిపోయి కనిపించింది అమీషా. ఇది సహజంగానే వారి రిలేషన్ గురించిన ఉత్సుకతకు దారితీసింది. ఫోటోలో నిర్వాణ్ ఒడిలో అమీషా కూర్చోవడమే కాకుండా ఇద్దరూ ప్రేమజంటలా వామ్ గా కనిపించారు. ఈ జంట దుబాయ్‌లో ఉన్నారని క్యాప్షన్ రివీల్ చేసింది. అమీషా క్యాప్షన్‌లో హార్ట్ ఎమోజీలు కూడా ఉన్నాయి. నిర్వాన్ వ్యాఖ్యల విభాగంలో “చాలా సరదాగా! నిన్ను ప్రేమిస్తున్నాను“ అంటూ నీలి హృదయంతో ప్రతిస్పందించారు.
Read Also:Darshi : ప్రియదర్శి ‘సారంగపాణి జాతకం’ టీజర్ డేట్ ఇదే..
తాజావార్తలు
-
BRICS: భారత్‌కు దౌత్య విజయం.. ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’పై బ్రిక్స్ ఖండన..
-
Ponguleti Srinivas Reddy : భూభారతి వెనుక అసలు కథ ఇదే.. సభలో మంత్రి సంచలన ఆరోపణలు
-
Mayawati: బీఎస్పీ వారసత్వంలో మాయావతి ఊహించని ట్విస్ట్.. అన్న కొడుకులకు నో ఛాన్స్! మేనకోడలికి రెడ్ కార్పెట్..
-
PMKMY: రైతులకు ప్రతీ నెల రూ.3 వేల పెన్షన్.. ఈ స్కీమ్‌లో జాయిన్ అయితే చాలు..
-
BRICS 2026: మోదీ చేతుల్లో జిన్‌పింగ్, పుతిన్.. బ్రిక్స్ ఫోటోతో ప్రపంచం షేక్..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!