RCB Title: అందుకే ఆర్సీబీ ఇంకా టైటిల్ గెలవలేదు: అంబటి రాయుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rayudu on RCB Title: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభమైనప్పటి నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ప్రాంచైజీ ఆడుతున్నా.. ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా సాధించలేదు. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్, గ్లెన్ మాక్స్వెల్, డానియెల్ వెటోరి.. లాంటి అంతర్జాతీయ స్టార్లు జట్టులో ఉన్నా ఆర్సీబీ కప్ గెలవలేకపోయింది. అయితే ఆర్సీబీ ఇంకా టైటిల్ గెలవలేకపోవడానికి కారణం ఈ స్టార్ క్రికెటర్లే అని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు పేర్కొన్నాడు. భారీ మొత్తాలు తీసుకుంటున్న అంతర్జాతీయ క్రికెటర్లు ఒత్తిడికి లోనవుతుండటమే ఆర్సీబీ టైటిల్ కరవుకు కారణమని తెలిపాడు.
స్టార్ స్పోర్ట్స్ షో ‘క్రికెట్ లైవ్’లో అంబటి రాయుడు మాట్లాడుతూ… ‘రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు ఎప్పుడూ కూడా ఎక్కువ పరుగులు ఇస్తారు. ఇక బ్యాటింగ్ విభాగం సరైన ప్రదర్శన చేయదు. ఒత్తిడి సమయాల్లో బ్యాటింగ్ చేస్తున్న వాళ్లంతా భారత యువ బ్యాటర్లే. ఇటీవల దినేష్ కార్తీక్ ఆ భారం మోస్తున్నాడు. ఒత్తిడిని ఎదుర్కోవాల్సిన అంతర్జాతీయ స్టార్ ఆటగాళ్లు ఎక్కడ?. క్లిష్ట పరిస్థితులలో అందరూ డ్రెస్సింగ్ రూమ్‌లో ఉంటారు. 16 ఏళ్లుగా ఇదే జరుగుతోంది’ అని అన్నాడు.
Also Read
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
- Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్‌రేప్
Also Read: Shreyas Iyer: 272 స్కోర్ చేస్తామని అస్సలు అనుకోలేదు.. ఏమాత్రం బాధ లేదు: శ్రేయస్ అయ్యర్
‘తీవ్ర ఒత్తిడి ఉన్నప్పుడు స్టార్ ఆటగాళ్లు ఎప్పుడూ క్రీజులో నిలబడరు. యువ ఆటగాళ్లంతా బ్యాటింగ్ ఆర్డర్లో దిగువన వస్తున్నారు. స్టార్ బ్యాటర్లంతా టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తున్నారు. కఠిన సమయాల్లో క్రీజులో సీనియర్లు ఎవరూ ఉండరు. ఇలాంటి జట్టు ఎప్పటికీ టైటిల్ గెలవదు. ఐపీఎల్లో బెంగళూరు టైటిల్ విజేతగా నిలవకపోవడానికి కారణం ఇదే’ అని అంబటి రాయుడు వివరించాడు. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తరఫున రాయుడు ఐపీఎల్ టైటిళ్లు సాధించిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
-
Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
-
Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
-
Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
-
Telangana High Court : కల్యాణలక్ష్మికి హైకోర్టు షాక్.. రేపే కీలకం.!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!