NTV Telugu Site icon

Ambati Rambabu: జగన్ కమిడియన్ అయితే.. మరి నువ్వేంటి నాగబాబు?

Ramababu

Ramababu

జగన్ కమిడియన్ అయితే.. మరి నువ్వేంటి? అని ఎమ్మెల్సీ నాగబాబును మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. “నువ్వు, మీ అన్న, మీ తమ్ముడు ముగ్గురూ రాజకీయాల్లోకి వచ్చారు. మీ అన్న ఎలాగోలా కాంగ్రెస్‌లో చేరి మంత్రి అయ్యాడు. శాసనసభకు రావడానికి మీ తమ్ముడు పవన్ కళ్యాణ్‌కి పదహారు సంవత్సరాల సమయం పట్టింది. అది కూడా చంద్రబాబు నాయుడు సంక ఎక్కితే ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత మీకు ఒక ఎమ్మెల్సీ వచ్చింది. బాగానే ఉంది కానీ.. జగన్మోహన్ రెడ్డితో పోల్పడమే బాగోలేదు. జగన్ వీరోచితంగా పోరాడిన వ్యక్తి. ఢిల్లీ కోటను పగలగొట్టినటువంటి వ్యక్తి. పార్టీ పెట్టిన పదేళ్లకు ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. ఈ రాష్ట్రాన్ని అయిదేళ్లు పాలించారు. ఆయన తండ్రి, ఆయన ఓటమి ఎరుగని ధీరులు. వాళ్లతో పోల్చుకుంటారేంటి? ఇంకో ఆయన మరో మాట అన్నారు. రాజశేఖర్‌రెడ్డి కొడుకు కాకపోతే ముఖ్యమంత్రి అయ్యేవాడా? అన్నాడు. చిరంజీవి తమ్ముకాకపోతే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? చిరంజీవి కూడా అల్లు రామలింగయ్యతో వియ్యం పొందిన తర్వాత స్టార్ హీరో అయ్యారు. మంచి నటుడిగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. ఆ తర్వాత మీరిద్దరూ ఆ పేరును పట్టుకుని ముందుకెళ్లారు. మీరు ఇలాంటివి మాట్లాడితే ఎలా? రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్‌రెడ్డి అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకులు. ప్రజలకు సేవ చేయడం ద్వారా ఈ ప్రజాదరణ వచ్చింది. సినిమాలో నటించడం ద్వారా రాలేదు.” అని మాజీ మంత్రి విమర్శించారు.
Ambati Rambabu Sensational Comments On Nagababu | NTV