జగన్ కమిడియన్ అయితే.. మరి నువ్వేంటి? అని ఎమ్మెల్సీ నాగబాబును మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. "నువ్వు, మీ అన్న, మీ తమ్ముడు ముగ్గురూ రాజకీయాల్లోకి వచ్చారు. మీ అన్న ఎలాగోలా కాంగ్రెస్‌లో చేరి మంత్రి అయ్యాడు. శాసనసభకు రావడానికి మీ తమ్ముడు పవన్ కళ్యాణ్‌కి పదహారు సంవత్సరాల సమయం పట్టింది. అది కూడా చంద్రబాబు నాయుడు సంక ఎక్కితే ఎమ్మెల్యే అయ్యారు.