NTV Telugu Site icon

Ambati Rambabu : జనంపై విద్యుత్‌ చార్జీల భారం మోపుతున్నారు

Ambati

Ambati

Ambati Rambabu : విద్యుత్‌ ఛార్జీల పెంపుపై వైసీపీ నిరసనలు వ్యక్తం చేసింది. ఏపీ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది వైసీపీ. అయితే. ఈ నేపథ్యంలో గుంటూరులో నిర్వహించిన వైసీపీ నిరసన కార్యక్రమంలో మాజీమంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. తమ్ముళ్లు మీరు మాకు ఓటు వేయండి విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి చంద్రబాబు అధికారంలోకి వచ్చారన్నారు. తగ్గించడం సంగతి దేవుడు ఎరుగు ,చార్జీల మోత మోగుతుందన్నారు అంబటి రాంబాబు. వైసీపీకి 11 సీట్లు అనుకోవద్దు, సంబర పడవద్దు… 40 శాతం ఓట్లు ఉన్నాయి అన్న విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు అంబటి రాంబాబు. అన్ని ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని కాదని, కూటమి ప్రభుత్వానికి ఎందుకు ఓట్లు వేశామా ,అని ప్రజలు బాధపడుతున్నారని, ప్రజల తరఫున పోరాడితే, వైసీపీ నాయకులు పై సోషల్ మీడియా పేరుతో కేసులు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు.

MLC Kavitha: రిజర్వేషన్లు తేల్చకుండా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు..

కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో కూడా టోల్ చార్జీలు వసూలు చేయాలని చూస్తుందని, ఆ విషయాన్ని నిలదీస్తే తప్పా? అని ఆయన ప్రశ్నించారు. నాతో సహా ,వైసీపీ సీనియర్ నాయకులు, అందరి మీద కేసులు పెడుతున్నారని, కేసులకు భయపడి రాజకీయాలు చేసేవాళ్లం కాదన్నారు అంబటి రాంబాబు. విద్యుత్ చార్జీలతోపాటు, నువ్వు చేసే ప్రజా వ్యతిరేక, పరిపాలనపై వైసీపీ పోరాడుతూనే ఉంటుందని, వరి రైతుకు కనీసం 1740 గిట్టుబాటు ధర, ప్రభుత్వం చెల్లించాలన్నారు అంబటి రాంబాబు. కానీ ఒక్క బస్తా కూడా గిట్టుబాటు ధరకు కొనలేదని, 1300కు, 1400కు బేరాలు ఆడి మిల్లర్లు రైతులను దోచుకుంటున్నారన్నారు. అయినా ప్రభుత్వానికి పట్టడం లేదని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.

Rohit Sharma Captaincy: రోహిత్ కెప్టెన్సీ అస్సలు బాలేదు.. టీమిండియా మాజీ హెడ్ కోచ్ ఫైర్!

Show comments