Ambati Rambabu: మాజీ మంత్రి ఇంటి వద్ద క్షణక్షణం ఉద్రిక్తత.. అంబటికి ఫోన్ చేసిన వైఎస్ జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిదగ్గర హైటెన్షన్ కొనసాగుతోంది. క్షణక్షణం ఉద్రిక్తతగా మారుతోంది. టీడీపీ శ్రేణులు అక్కడే మోహరించారు. అంబటి ఇంట్లోకి దూసుకెళ్లేందుకు విడతలవారీగా ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు. అంబటి అంతు తేలుస్తామంటూ టీడీపీ కేడర్ మండిపడుతోంది. ఓపక్క పోలీసులు.. ఇంకోపక్క టీడీపీ నాయకులు, కార్యకర్తల మధ్య పరిస్థితి గందరగోళంగా మారింది. ప్రస్తుతం మాజీ మంత్రి అంబటి ఇంట్లోనే ఉన్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్ మాజీ మంత్రికి ఫోన్ చేశారు.
READ MORE: Ravidas Jayanti 2026: రేపే గురు రవిదాస్ జయంతి.. డేరా సచ్‌ఖండ్ బాలన్‌ను సందర్శించనున్న ప్రధాని మోడీ
Also Read
- Ketan Murder Case: "ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం".. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
- రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
- Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
- Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ "పెసర గారెలు" చేసేయండి ఇలా.!
అంబటి రాంబాబుపై జరిగిన హత్యాయత్నం ఘటనపై మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అంబటికి ఫోన్ చేసి పరామర్శించిన జగన్, ఆయనకు ధైర్యం చెప్పారు. ఇలాంటి క్లిష్ట సమయంలో పార్టీ మొత్తం అంబటి రాంబాబు వెంటే ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ మాట్లాడు..తూ రాష్ట్రం పూర్తిగా జంగిల్‌రాజ్‌గా మారిపోయిందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ఆటవిక రాజ్యంలా నడుపుతున్నారని విమర్శించారు. రోజురోజుకూ చంద్రబాబు దుర్మార్గాలు పెరిగిపోతున్నాయని, ఉద్దేశపూర్వకంగానే హత్యాయత్నాలు, దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
READ MORE: VIGNAN MAHOTSAV 2026: ప్రతిభకు గుర్తింపు ఇచ్చే జాతీయ యువజనోత్సవం.. యువతకు లక్కీ ఛాన్స్
అంబటి రాంబాబుపై జరిగిన దాడి కూడా యాదృచ్ఛికం కాదని, ముందే పన్నిన కుట్రలో భాగంగానే ఈ హత్యాయత్నం జరిగిందని జగన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు ఈ ఘటనలో ప్రేక్షకుల్లా వ్యవహరించారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అరాచక పాలనను ప్రజలు గమనిస్తున్నారని, ఈ దుర్మార్గ పాలనను ఎక్కువ కాలం సహించబోరని జగన్ స్పష్టం చేశారు. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల వైఫల్యం వల్లే రాష్ట్రంలో దాడులు, హింసా ఘటనలు పెరుగుతున్నాయని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యాన్ని, న్యాయాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
-
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
-
Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్‌గా నియమితురాలైన ముస్కాన్
-
Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
-
NRI: అంతిమ శ్వాస భారత్‌లోనే… అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
ట్రెండింగ్
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!