Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిదగ్గర హైటెన్షన్ కొనసాగుతోంది. క్షణక్షణం ఉద్రిక్తతగా మారుతోంది. టీడీపీ శ్రేణులు అక్కడే మోహరించారు. అంబటి ఇంట్లోకి దూసుకెళ్లేందుకు విడతలవారీగా ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు. అంబటి అంతు తేలుస్తామంటూ టీడీపీ కేడర్ మండిపడుతోంది. ఓపక్క పోలీసులు.. ఇంకోపక్క టీడీపీ నాయకులు, కార్యకర్తల మధ్య పరిస్థితి గందరగోళంగా మారింది. ప్రస్తుతం మాజీ మంత్రి అంబటి ఇంట్లోనే ఉన్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో…