Minister Narayana: మూడు ముక్కలాట ముగిసింది.. 2028 ఆగస్టుకి అమరావతిని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తాం!

  • ధర్మం గెలిచింది, మూడుముక్కలాట ముగిసింది
  • అమరావతి రాజధాని అని చట్టసభలో ఆమోదం పొందింది
  • చట్టసభల్లో ఏం మాట్లాడాలో అర్ధం కాక వైసీపీ నేతలు ప్లాట్లు, ఖర్చు అంటున్నారు
Minister Narayana

Minister Narayana

ధర్మం గెలిచింది, మూడుముక్కలాట ముగిసిందని మంత్రి నారాయణ అన్నారు. అమరావతి రాజధాని అని చట్టసభలో ఆమోదం పొందిందన్నారు. చట్టసభల్లో ఏం మాట్లాడాలో అర్ధం కాక వైసీపీ నేతలు ప్లాట్లు, ఖర్చు అంటున్నారని.. ప్లాట్లు ఇక అలాట్ చేయాల్సింది 650 మందికి మాత్రమే అన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ఏమి మాట్లాడుతున్నాడో అతనికే తెలీదని.. అవినీతి అంటాడు, జీఎస్టీ అంటాడు, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. 2028 ఆగస్టుకి రాజధాని అమరావతిని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తాం అని మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరులో అమరావతి చట్టభద్రతపై మంత్రి నారాయణ హాట్ కామెంట్స్ చేశారు.

‘ధర్మం గెలిచింది, మూడుముక్కలాట ముగిసింది. అమరావతి రాజధాని అని చట్టసభలో ఆమోదం పొందింది. చట్టసభల్లో వైసీపీ నేతలు ఏం మాట్లాడుతున్నారో అర్ధం కాక ప్లాట్లు, ఖర్చు అంటున్నారు. ప్లాట్లు ఇక అలాట్ చేయాల్సింది 650 మందికి మాత్రమే. డేటా తీసుకొని మాట్లాడితే బావుంటుంది, ఏది పడితే అది మాట్లాడుతున్నారు. దాదాపు అందరికి రిజిస్ట్రేషన్ అయిపోయింది. 70,790 ప్లాట్లు అలాట్ చేసాం, కొందరికే ఆగాయి. వైఎస్ జగన్ ఏమి మాట్లాడుతున్నాడో అతనికే తెలీదు. అవినీతి అంటాడు, జిఎస్టీ అంటాడు, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. అబద్దాలు మాట్లాడుతున్నారు. నేను ఢిల్లీకి వెళ్లి జీఎస్టీ గురించి మాట్లాడి వచ్చాను. నోటికొచ్చిన రేట్లు చెప్పడం సరికాదు’ అని మంత్రి నారాయణ అన్నారు.

Also Read: Tiger Scare: పోలవరం ప్రాంతంలో పులి సంచారం కలకలం.. రామదుర్గం కొండపై సందర్శకులు ఆందోళన!

‘అంతర్జాతీయ స్థాయిలో అమరావతిని నిర్మిస్తున్నాం. ప్రజా పన్ను అమరావతిలో ఒక్కరూపాయి కూడా ఖర్చు పెట్టం. హైదరాబాద్ కంటే అమరావతిని అభివృద్ధి చేయాలని సీఎం చూస్తున్నారు. అంతర్జాతీయ క్రీడా స్టేడియంలు కడుతున్నాం. అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ కట్టాలి, అందుకు ల్యాండ్ పూలింగ్ చేస్తున్నాం. 2028 ఆగస్టుకి అమరావతి ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తాం. సర్వే రాళ్లపై వైఎస్ జగన్ బొమ్మ వేసుకోవడాని 750 కోట్లు ప్రజల సొమ్ము ఖర్చు పెట్టాడు. రాజధానులు నుంచి వచ్చే ఆదాయంతో అన్ని రాష్ట్రాల్లో అభివృద్ధి జరుగుతుంది. ప్రజలను తప్పుదోవ పాటించాలనే త్రోవలోనే జగన్ నడుచుకుంటున్నాడు. జగన్ ఏం మాట్లాడారో నాకు అర్ధం కాలేదు. జగన్ మూడు రాజధానుల, మూడు ముక్కలాట ముగిసింది. మళ్లీ రాజదాని అంశంపై మరో మూడు ముక్కలాట మొదలు పెట్టారు’ అని మంత్రి నారాయణ విమర్శించారు.