Site icon NTV Telugu

Bandi Sanjay: అలాంటి వారిని బీజేపీలో చేర్చుకోం.. బండి సంజయ్ కీలక ప్రకటన

Bandi Sanjay

Bandi Sanjay

కరీంనగర్ బీఆర్ఎస్ కార్పొరేటర్లు బీజేపీలో చేరేందుకు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం బండి సంజయ్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. “మేయర్ తో కలిసి 20 మంది కార్పొరేటర్లు బీజేపీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు.. కేంద్ర మంత్రి బండి సంజయ్ ముందు మేయర్ సునీల్ రావు ప్రతిపాదన ఉంచారు. భూకబ్జాలు, నేర చరిత ఉన్నోళ్లు, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న బీఆర్ఎస్ నాయకులను బీజేపీలో చేర్చుకోబోమని బండి సంజయ్ స్పష్టం చేశారు. బీజేపీలో కష్టపడుతున్న నాయకులు, కార్యకర్తలును గెలిపించుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని స్పష్టం చేశారు. ప్రజల్లో మంచి పలుకుబడి ఉన్న బీఆర్ఎస్ కార్పొరేటర్లను మాత్రమే బీజేపీలోకి తీసుకురావాలని మేయర్‌ని కోరారు. బండి సంజయ్ సూచన నేపథ్యంలో పరిమిత సంఖ్యలో కార్పొరేటర్లతో కలిసి మేయర్ సునీల్ రావు బీజేపీలో చేరనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు తన అనుచరులతో కలిసి బీజేపీలో చేరనున్నారు.” అని ప్రకటనలో పేర్కొన్నారు.

READ MORE:   Triphala: త్రిఫల నీటిని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

Exit mobile version